బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత... సీసీ కెమెరాల ఏర్పాటు.. వేలాది మంది సిబ్బంది మోహరింపు

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2015 (07:19 IST)
తిరుమల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఎత్తున భద్రతను పెంచింది. సీసీ కెమెరాల ఏర్పాటు.. సాయుధ బలగాల మోహరింపు వంటి చర్యలు తీసుకున్నారు. తీవ్రవాదుల ముప్పు హెచ్చరికలతో తిరుమల సెక్యూరిటీని అమాంతం పెంచేశారు. 
 
మాడ వీధులలో 29 గేట్లను... 13 అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేశారు. ప్రతి ద్వారం వద్ద సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. తిరుమలలో 24 గంటలూ బాంబు డిస్పోజల్ టీంలు తిరుగుతుంటాయి. అతిథి గృహాలు, మండపాలు, బహిరంగ ప్రాంతాలు, ఇలా ఒకటేంటి అన్నింటి వద్ద వీరు ఆకస్మిక తనిఖీుల చేస్తూనే ఉంటారు. లక్షలాది మంది జనం ఇక్కడకు చేరుతుండడంతో ఈ ర్యలు తీసుకున్నారు. 
 
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఎన్డీఆర్ఎఫ్ దళం, రెండు ఆక్టోపస్ దళాలు తిరుమలలో తిష్ట వేశాయి. వీరికి తోడుగా ఒక గ్రేహౌండ్స్ దళాలు, 2600 మంది హోంగార్డులు, ఎస్పీఎఫ్ దళాలు 24 గంటలు విధులు నిర్వహిస్తారు. తిరుమల ఆలయం చుట్టూ ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేశారు. నడక దారిలో భద్రతను కూడా పెంచారు. అడుగడునా భక్తులకు సహకరించే విధం ఏర్పాట్లు చేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పదో తరగతి పరీక్షల్లో ఒకేసారి పాసయిన తల్లీకొడుకులు

పెళ్లి మండపంలో వరుడికి దండ వేయకుండా ప్రియుడికి వేసి హత్తుకుంది, రచ్చరచ్చ వీడియో

కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను పాకిస్తాన్ భూభాగంలో చూపిన నేపాల్ ఎయిర్‌లైన్స్, క్షమాపణ

చిన్నపాటి గొడవ- భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త.. ఎక్కడ?

కోతితో బామ్మ ఫైట్, ఏం జరిగిందో చూడండి, వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

28-04-2026 మంగళవారం ఫలితాలు - కానుకలిచ్చిపుచ్చుకుంటారు...

26-04-2026 ఆదివారం ఫలితాలు - కష్టించినా ఫలితం ఉండదు...

26-04-2026 నుంచి 02-05-2026 వరకు ఫలితాలు - అహంకారం ప్రదర్శించవద్దు

ఆదివారం ఆదిత్యుడిని పూజిస్తే...?

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం.. నివేదిక సిద్ధం..జూన్ 30న సమర్పణ

Show comments