మే 11 నుంచి శుభప్రదం

Webdunia
బుధవారం, 11 మార్చి 2015 (21:12 IST)
పాఠశాల విద్యార్థుల కోసం ప్రతీ యేడు ఏర్పాటు చేసే శుభప్రదం కార్యక్రమాన్ని మే 11 నుంచి పది రోజుల పాటు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు తెలిపారు. బుధవారం తిరుపతిలో ఆయన శుభప్రదానికి సంబంధించిన గోడ పత్రికలను విడుదల చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో దాదాపు 30 వేల మంది విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. వారి కోసం మే 11 నుంచి 20 వరకూ వేసవి సెలవులలో మాత్రమే ఈ కార్యక్రమాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. దీనిపైన రెండు రాష్ట్రాలలో తగిన ప్రచారాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. 
 
ధార్మిక కార్యక్రమాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించి వారిలో ఏడు మందిని ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈవో పోలా భాస్కర్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి ప్రయాగ రామకృష్ణ, ప్రత్యేకాధికారి రఘునాథ తదితరులు పాల్గొన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

TTD EO Anil Kumar Singhal: నెయ్యిలో కల్తీ ఆరోపణలు.. టీటీడీ ఈవో బదిలీ

Ambati Rambabu: అంబటి రాంబాబుపై 16 కేసులు.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్

Tiger: తూర్పు గోదావరి జిల్లాలో మూడు ఆవులను చంపేసిన పులి.. ప్రజల్లో భయం

మైనర్ బాలిక దాలిస్తే ఇంట్లోనే గర్భస్రావం చేసిన తల్లిదండ్రులు

నోరు అదుపులో పెట్టుకోవాల్సిందే : అంబటి సతీమణి పిటిషన్‌పై హైకోర్టు కామెంట్స్

అన్నీ చూడండి

లేటెస్ట్

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

Show comments