Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేషన్ తరహాలో తిరుమల శ్రీవారి కోటా దర్శనం..!

Webdunia
గురువారం, 21 మే 2015 (14:40 IST)
భగవంతుడి దర్శనాన్ని కూడా రేషన్ కోటా తరహాలో భక్తులకు అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానం యోచిస్తోంది. ఇప్పటికే ఉద్యోగులకు లడ్డూలను కోటా పద్దతిని అందజేస్తోంది. ఇక మీదట దర్శనాన్ని ఉద్యోగులకు, తరువాత స్థానికులకు, ఆ తరువాత భక్తులకు కోటా పద్దతిలో దర్శనం చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఒక్క సారి ఒక భక్తుడు శ్రీవారి దర్శనం చేసుకుంటే మరో మూణ్ణెళ్ళ వరకూ మళ్ళీ దర్శనానికి అనుమతించరన్నమాట. ఆధార్ కార్డును అనుసంధానం చేసుకుని ఇలా కోటా దర్శనాన్ని ప్రవేశపెట్టనున్నారు.  బహుశా ప్రంపంచంలో ఎక్కడా ఉండదేమో.. 
 
స్వామివారి దర్శనానికి వచ్చేవారందరికీ ఆధార్‌కార్డు వర్తింప చేసి సమగ్రడేటాను సేకరించాలని టీటీడీ భావిస్తోంది. తిరుమల, తిరుపతిలో ఉండే స్థానికుల్లో ఐదు వేల మందికి ప్రతినెలా మొదటి మంగళవారం శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. దర్శనానికి ఒక సారి వచ్చినవారు తిరిగి మూడు నెలలులోపు  రాకుండా ఆధార్ నంబర్‌తో గుర్తించి నియంత్రించేందుకు ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ ఆధార్‌కార్డు వర్తింప చేయాలని నిర్ణయించామని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు తెలిపారు. 
 
ఈ ఈవో చెప్పే ప్రకారం ఒక భక్తుడు ఈ రోజు దర్శనం చేసుకుంటే మరో మూణ్ణెళ్ల వరకూ దర్శనం చేసుకోవడానికి వీలు లేదు. కోటా పద్దతిని దర్శనం కల్పిస్తారన్నమాట ఇదేమైన రేషన్ బియ్యమా..! కోటా పద్దతిని దర్శనం కల్పించడానికి. అసలు భగవంతుణ్ణి దర్శించుకోవద్దనే హక్కు టీటీడీకి ఉందా...! అదేవిధంగా ఈవోగానీ, జేఈవోగానీ అదేవిధంగా భగవంతునికి దూరంగా ఉండగలరా..! ఉండి ఆ తరువాత ఎవరికైనా అమలు చేస్తే చాలా చక్కగా ఉంటుందనే విమర్శలు వస్తున్నాయి.  
 
సిఫార్సు లేఖలు, ఎవరి రికమండేషన్ లేకుండానే ఆధార్‌కార్డు సేకరణ వెనుక అసలు కథ స్వామి దర్శనంలో కోటా పద్ధతి దాగుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. స్థానికులకు అమలు చేసే కోటా దర్శన విధానమే భవిష్యత్‌లో యాత్రికులకు వర్తింప చేయాలని టీటీడీ భావిస్తోందని సమాచారం. ఇవేవి లేకుండా నేరుగా ప్రతీ శనివారం స్వామిని సర్వదర్శనం ద్వారా దర్శించుకుని వెళ్ళే భక్తులు వేలలో ఉన్నారు. కనీసం చెప్పులు కూడా లేకుండా కొండెక్కే స్థానికులు కోకొల్లలు వారిని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments