Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పాత్రలో పెట్టిన నైవేద్యమంటే విష్ణువుకు మహా ప్రీతి..!

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (12:38 IST)
రాగిపాత్ర మహావిష్ణువుకు ప్రీతికరమైందని శాస్త్రాలు చెప్తున్నాయి. సాధారణంగా లోహాలలో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అవి దైవానికి ప్రతిరూపాలుగా చెబుతారు. సువర్ణం ఈశ్వరునికి సంబంధించినదైతే.. విష్ణువుకు రాగి ప్రీతికరమైనది. రాగితో చేసిన పాత్రలలో మహావిష్ణువుకు నైవేద్యం పెడితే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని వరాహపురాణం చెప్తోంది. 
 
పూర్వం రాక్షసుల్లో గూడాకేశుడు అనే రాక్షసుండుండేవాడు. అతడు రాక్షసుడైనా దుర్మార్గపు బుద్ధి లేకుండా దైవ చింతనతో ప్రవర్తిస్తూ శ్రీ మహావిష్ణువును నిరంతరం ఆరాధిస్తూ ఉండేవాడు. అలా 16వేల సంవత్సరాల పాటు విష్ణువును గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి విష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఏం కావాలో కోరమంటాడు.

అప్పుడు ఆ భక్తుడు తనకు వరాలు అవసరం లేదని.. వేల జన్మాల పాటు విష్ణుభక్తి తనకు ఉండేలా అనుగ్రహించాలంటాడు. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు విడిచిన చక్రం వలన తనకు మరణం కలగాలని అప్పుడు తన శరీరమంతా రాగి లోహంగా మారిపోవాలని కోరుకున్నాడు. 
 
ఆ పరిశుద్ధమైన లోహంతో తయారైన పాత్రలో ప్రతినిత్యం శ్రీ మహావిష్ణువుకు నైవేద్యం అందేలా వరమివ్వాలని గూడాకేశుడు విష్ణువును ప్రార్థించాడు. గూడాకేశుడిని అనుగ్రహించి విష్ణువు అంతర్థానమయ్యాడు. ఆ తర్వాత కూడా రాక్షసుడు తపస్సును కొనసాగించాడు. వైశాఖశుద్ధ ద్వాదశినాడు శ్రీ మహావిష్ణువు ఆ అసురుడి కోరిక తీర్చాలనుకున్నాడు. అదే రోజున విష్ణువు తన చక్రాన్ని అసురుడిపై ప్రయోగించాడు. వెంటనే అది అతడిని ఖండించింది. అతడి మాంసం తామ్రం అయ్యింది. అతడి శరీరంలోని అస్థికలు వెండి అయ్యాయి. మలినాలు కంచులోహంగా మారిపోయాయి. 
 
తనను జీవితాంతం అలా స్మరిస్తూ ఉన్న భక్తుడి కోరికను తీర్చాడు మహావిష్ణువు. గూడాకేశుడి శరీరం నుంచి ఏర్పడిన తామ్ర లోహంతో ఓ పాత్ర తయారైంది. ఆ పాత్రలో పెట్టిన నైవేద్యమంటే విష్ణువుకు మహా ప్రీతికరమైంది. ఆ తర్వాతే భక్తులు రాగిపాత్రలో పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే విష్ణువు ఆనందంతో స్వీకరించసాగాడు. లోహాల్లో రాగి శ్రేష్ఠమైనదని పురాణాలు చెప్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

టీటీడీ గోశాలలో 100కి పైగా ఆవులు చనిపోయాయా? అవన్నీ అసత్యపు వార్తలు

హనుమజ్జయంతి ఎప్పుడు.. పూజ ఎలా చేయాలి?

11-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : ఆశలు ఒదిలేసుకున్న ధనం?

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

తర్వాతి కథనం
Show comments