Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంజనేయుడు పంచముఖుడు ఎందుకయ్యాడో తెలుసా?

తలుచుకున్నంత మాత్రాన సకల కష్టాలను చిటికెలో రూపుమాపేవాడు అంజినీ పుత్రుడు. కొలిచినంత మాత్రాన సకల అభీష్టాలనూ నెరవేర్చేవాడు ఆ హనుమంతుడు. హనుమంతుని పంచముఖుని రూపంలో ఆరాధించడం ఈమధ్య ఎక్కువగా చూస్తున్నదే. కానీ ఇదేమీ కొత్తగా చేరిన ఆచారం కాదు. శ్రీరాముని రక్ష

Webdunia
శనివారం, 28 జనవరి 2017 (18:24 IST)
తలుచుకున్నంత మాత్రాన సకల కష్టాలను చిటికెలో రూపుమాపేవాడు అంజినీ పుత్రుడు. కొలిచినంత మాత్రాన సకల అభీష్టాలనూ నెరవేర్చేవాడు ఆ హనుమంతుడు. హనుమంతుని పంచముఖుని రూపంలో ఆరాధించడం ఈమధ్య ఎక్కువగా చూస్తున్నదే. కానీ ఇదేమీ కొత్తగా చేరిన ఆచారం కాదు. శ్రీరాముని రక్షించడం కోసం ఆంజనేయుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలోనే కనిపిస్తుంది. ఆనాటి నుంచే ఆంజనేయుని పంచముఖునిగా కొలుచుకునే సంప్రదాయం మొదలైంది. 
 
మైరావణ వృత్తాంతం ఏం చెబుతుందంటే రామాయణంలో రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసికొట్టడం తెలిసిందే. సీతను చేజిక్కించుకునేందుకు రామారావణుల మధ్య భీకర సంగ్రామం మొదలైంది. రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ పోరులోకి దిగిన రావణుడు, యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పలచబడి పోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. 
 
తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూలడంతో బెంబేలు పడిపోతాడు. వెంటనే పాతాళ లోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సాయం కోరతాడు. మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారి చుట్టూ ఎంత కాపలాను ఉంచినా అందరి కళ్ళూ కప్పి రామలక్ష్మణులను పాతాళలోకానికి అపహరించుకపోతాడు మైరావణుడు.
 
హనుమంతుని పయనం... 
రామలక్ష్మణులను వెతుక్కుంటూ తాను కూడా పాతాళానికి చేరుకుంటాడు హనుమంతుడు. అక్కడ మైరావణుని రాజ్యానికి రక్షగా నిలుచున్న మకర ధ్వజుడు అనే వింతజీవిని చూస్తాడు. ఇంతకీ ఆ మకరధ్వజుడు మరెవ్వరో కారని, తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని ఓ జలకన్య గ్రహించడం వల్ల జన్మించిన తన కుమారుడేనని తెలుస్తుంది. అయినా ఉద్యోగ ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్యా జరిగిన భీకరపోరులో హనుమంతునిదే పైచేయి అవుతుంది.
 
మైరావణుని సంహారం...
మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధాన్ని ఆరంభిస్తాడు. కానీ ఒక ఉపాయాన్ని సాధిస్తే తప్ప మైరావణునికి చావు సాధ్యం కాదని తెలుసుకుంటాడు. మైరావణుని పురంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతనికి చావు మూడదని తెలుస్తుంది. అందుకోసం తూర్పు, పశ్చిమము, ఉత్తరం, దక్షిణం, ఊర్ధ్వముఖం ఇలా అయిదు దిక్కులా అయిదు ముఖాలను ధరించి అయిదు దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు. పంచముఖాలతో పాటుగా ఏర్పడిన పది చేతులలో ఖడ్గం, శూలం, గద వంటి వివిధ ఆయుధాలను ధరించి మైరావణుని అంతం చేస్తాడు హనుమంతుడు. అతనే పంచముఖాంజనేయుడు.
 
పంచముఖాల ప్రాశస్త్యం ఏంటంటే అయిదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. అయిదు కర్మేంద్రియాలతో మనిషి ప్రపంచంలో మనుగడను సాగిస్తూ అయిదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు. అలాంటి అయిదు సంఖ్య గురించి చెప్పేదేముంది. స్వామివారి పంచముఖాలలో ఒక్కో మోముదీ ఒక్కో రూపం. దక్షిణాన నారసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహవతారం, ఊర్ద్వ ముఖాన హయగ్రీవుని అంశ. అలాగే ఆ అయిదు రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్చిచ్చులో కాలిపోయిన hollywood సెలబ్రిటీల ఆస్తులు, పదివేల ఇళ్లకు పైగా బుగ్గి (video)

Rahul Gandhi: తెలంగాణలో జనవరి 27న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పర్యటన

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

స్మార్ట్‌ఫోన్ కోసం కుమారుడి ఆత్మహత్య.. అదే తాడుతో ఉరేసుకున్న తండ్రి.. ఎక్కడ?

Nara Lokesh: జగన్ మామ మోసం చేసినా చంద్రన్న న్యాయం చేస్తున్నారు.. నారా లోకేష్

అన్నీ చూడండి

లేటెస్ట్

ముక్కోటి ఏకాదశి: ఉత్తర ద్వారం నుంచి విష్ణు దర్శనం, విశిష్టత ఏమిటి?

09-01-2025 గురువారం దినఫలితాలు : ఆ రాశివారికి పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది....

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం

అవి ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం : తితిదే ఈవో శ్యామల రావు

08-01-2025 బుధవారం దినఫలితాలు : అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది...

తర్వాతి కథనం
Show comments