Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలియుగం ఎలా ఉంటుందని అడిగిన పాండవులకు కృష్ణుడు ఏమని సమాధానం చెప్పాడు?

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు తిరిగి హస్తినాపురాన్ని హస్తగతం చేసుకున్నారు. మహారాజుగా ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు. అయితే, ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుడిని ఓ ప్రశ్

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (15:45 IST)
కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు తిరిగి హస్తినాపురాన్ని హస్తగతం చేసుకున్నారు. మహారాజుగా ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు. అయితే, ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుడిని ఓ ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏంటంటే.. కలియుగం ఎలా ఉంటుందన్నది. 
 
ఈ ప్రశ్నకు శ్రీకృష్ణ భగవానుడు నవ్వి... చూడండి.. మీకు చూపిస్తాను అని చెప్పి.. నాలుగు దిక్కులకు నాలుగు బాణాలు సంధించాడు. ఆ బాణాలను నలుగురు నలు దిక్కులకు వెళ్లి తెమ్మన్నాడు. మాధవుడి ఆదేశానుసారం నలుగురు పాండవులు ఆ బాణాలను వెతుక్కుంటూ తలో దిక్కుకు వెళ్ళారు. 
 
ఇందులో తొలుత అర్జునుడికి ఒక బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధురగానం వినిపించి అటు తిరిగాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ జీవించివున్న కుందేలును పొడుచుకుతింటూ కనిపించింది. దీన్ని చూసిన అర్జునుడు నివ్వెర పోయాడు. వెంటనే శ్రీకృష్ణుడి వద్దకు వచ్చాడు. 
 
అలాగే, భీముడు కూడా ఒక బాణాన్ని గుర్తించాడు. ఆ బాణం దొరికిన చోటు... నలుదిక్కులా నీళ్లు నిండుగా ఉన్న నాలుగు బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది. దీన్ని చూసిన భీముడు ఆశ్చర్యపోయాడు. వెంటనే శ్రీకృష్ణుడి వద్దకు పరుగెత్తుకొచ్చాడు. 
 
అదేవిధంగా నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అపుడే పుట్టిన దూడను గాయాలయ్యేంత వరకూ నాకుతుంది. చుట్టూ ఉన్న జనం అతి కష్టంమీద ఆ రెండింటినీ విడతీస్తారు. 
 
ఇక సహదేవుడికి బాణం దొరికినచోట ఒక పర్వతంపై నుండి పెద్ద బండరాయి దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను కూల్చేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క వద్ద ఆగిపోతుంది. ఈ దృశ్యాలను చూసిన నలుగురు పాండవులు.. ఇదేంటి పార్థా అని అడిగారు. వారికి శ్రీకృష్ణుడు ఏమని సమాధానం చెప్పాడంటే.. 
 
కలిగియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకుతిన్నరీతిగా భక్తులను దోచుకుంటారు. కలియుగంలో అత్యంత ధనికులు పేదలకూ పైసా కూడా సహాయం చేయరు. ఆవు తన దూడను గాయాలయ్యేంతగా ఎలా నాకిందే కలియుగంలో తల్లిదండ్రులు తమ పిల్లలను గారాం చేసి వాళ్ల జీవితాన్ని నాశనం చేస్తారు. కలియుగంలో జనులు మంచి నడవడిక కోల్పోయి కొండ మీద నుండి బండరాయి దొర్లినట్టుగా పతనం అవుతారు. వారిని భగవన్నామమనే చిన్న మొక్క తప్పా ఎవ్వరూ కాపాడలేరు అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ బిల్లు దేశాన్ని మధ్య యుగంలోకి నెట్టేస్తుంది : రాహుల్ గాంధీ

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే హోటల్‌కు రమ్మంటున్నారు..

ఢిల్లీలో దారుణం : అమ్మానాన్నలను చంపేసిన కుమారుడు..

Wife: బైకుపై వెళ్తూ భర్త ముఖంపై యాసిడ్ పోసిన భార్య.. ఎందుకో తెలుసా?

నాలా వద్ద మహిళ మృతదేహం.. వరదల్లో కొట్టుకుపోయిందా?

అన్నీ చూడండి

లేటెస్ట్

19-08-2025 మంగళవారం ఫలితాలు - బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది...

18-08-2025 సోమవారం ఫలితాలు - శ్రావణ సోమవారం శివార్చన చేస్తే...

17-08-2025 ఆదివారం దినఫలాలు - పుణ్య కార్యాల్లో పాల్గొంటారు....

ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఫలితాలు ఏమిటో తెలుసా?

Dasara: శ్రీశైలంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు

తర్వాతి కథనం
Show comments