మీలోని సేవా శక్తిని వెలికి తీయండి : సిబ్బందికి టీటీడీ ఈవో పిలుపు

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (20:30 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం చాలా శక్తివంతమైన సంస్థ అనీ, అందులో పని చేసే అధికారులు సిబ్బంది చాలా శక్తి యుక్తులు కలిగిన వారని ఆ సంస్థ కార్యనిర్వహణాధికారి తెలిపారు. వారు తమలో శక్తిని వెలికి తీసి సంస్థ పేరు ప్రతిష్టలను మరింత ఇనుమడింప చేసేలా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. 
 
గురువారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలోని విభాగాధిపతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తప్పకుండా టిటిడి సిబ్బందిలోని శక్తి యుక్తులను వెలికి తీస్తారనే నమ్మకం తనుకుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పని చేస్తే తప్ప వారికి మరింత పేరు ప్రతిష్టలు రావని ఆ దిశగా విభాగాధిపతులు మిగిలిన వారిని ఉత్సాహ పరచాలని కోరారు. విద్యా,వైద్యం, ఆధ్యాత్మిక విభాగాలలో టిటిడి ఇప్పటికే సేవలు అందిస్తోందని, అందులోనే మరింత సేవలు అందేలా కష్ట పడాలని కోరారు. 
 
 తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా తీర్చిదిద్దడానికి అవసరమైన సహాయ సహకారాలు సిబ్బందికి తన నుంచి ఎప్పుడూ లభిస్తాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తిరుపతి జేఈవో పోలా భాస్కర్, తిరుమల జేఈవో కె ఎస్ శ్రీనివాస రాజు, సిఈ చంద్ర శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి కులాన్ని ఒక సమస్యగా మారుస్తున్నారు.. కవిత

నితిన్ నబిన్ టూర్ వల్ల కేవలం గాడిద గుడ్డు మాత్రమే వస్తుంది.. రేవంత్ రెడ్డి

Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు.. హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు

శ్రీశైలంలో కల్తీ నెయ్యి కలకలం - సేమ్ తిరుమల తరహాలోనే సాగిందా?

చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం.. చనిపోయిన కాకులను తాకొద్దంటూ హెచ్చరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

శబరిమలలో మరో వివాదం.. పంపా సమీపంలో సినిమా షూటింగ్.. ఎప్పుడంటే?

02-02-2026 సోమవారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి...

01-02-2026 ఆదివారం ఫలితాలు.. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు.. నష్టపోతారు

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

Show comments