ఏప్రిల్ 21 నుంచి చారధామ్ యాత్ర.. తగ్గుతున్న భక్తుల సంఖ్య

Webdunia
సోమవారం, 23 మార్చి 2015 (08:54 IST)
వేసవి వచ్చిందంటే హిమగిరులలోని, హిమగిరిలను ఆనుకుని ఉన్న ఆలయాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. అక్షధామ్, చార్ ధామ్, కేథారీనాథ్ ఇలా ఒకటేంటి.. పర్వతపంక్తిలోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 21 నుంచి ఆలయాన్ని భక్తుల దర్శనానికి తెరవనున్నట్లు ఆలయ అధికారులు వివరించారు. 
 
హిందువుల పర్వదినమైన అక్షయ తృతీయ రోజున గంగోత్రి, యమునోత్రి దేవాలయాల ద్వారాలు తెరుస్తారన్నారు. మిగిలిన రెండు పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌ శీతాకాలం అక్టోబరు నుంచి నవంబరు వరకు మూసి ఉంచుతారు. కేదార్‌నాథ్‌లో 2013 జూన్‌లో జరిగిన ప్రకృతి వైపరీత్యం అనంతరం చార్‌ధామ్‌ యాత్రకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని అధికారులు పేర్కొన్నారు.
 
2012లో చార్‌ధామ్‌ యాత్రికుల సంఖ్య 2.84 కోట్లుగా ఉంటే 2013లో వారి సంఖ్య 2.09 కోట్లకు పడిపోయింది. 2014లో 2.26 కోట్ల మంది యాత్రికులు చార్‌ధామ్‌ సందర్శించారని అధికారులు చెప్పారు. చార్‌ధామ్‌ యాత్రకు వచ్చే భక్తుల సంఖ్య పడిపోవడం పట్ల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల సంఖ్య పెంచడానికి చర్యలు చేపడుతున్నామని ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి హరీష్‌ రావత్‌ పేర్కొన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసు: ఏడుగురు అధికారులపై క్రమశిక్షణా చర్యలు

ముఖ్యమంత్రి హోదాలో హస్తినకు విజయ్ ... నేడు ప్రధానితో భేటీ

కర్నాటక కాంగ్రెస్‌లోఅనూహ్య పరిణామాలు : సీఎం పదవికి రాజీనామా చేయనున్న సిద్ధరామయ్య...?

నీటి హైసింత్ వల్ల ప్రభావితమైన నీటి వనరులు.. మహిళలకు జీవనోపాధి.. ఎలా?

తెలంగాణలో నో ఎబోలా.. విమానాశ్రయం, ఆస్పత్రుల్లో కట్టుదిట్టమైన నిఘా

అన్నీ చూడండి

లేటెస్ట్

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

Show comments