క‌ర్పూరంతో హార‌తి ఇవ్వ‌డం మామూలే...?

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (11:56 IST)
దేవుళ్ల‌కు పూజ చేసే విష‌యానికి వ‌స్తే దీపం, అగ‌ర్‌బ‌త్తి వెలిగించడం, క‌ర్పూరంతో హార‌తి ఇవ్వ‌డం మామూలే. అయితే మన పూర్వీకులు చెప్పిన ఏ ఆచారం వెనుక అయినా శాస్త్రీయ కార‌ణాలు ఉంటాయి. పూజ సమయంలో వెలిగించే హార‌తి క‌ర్పూరం వెనుక కూడా కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. 
 
క‌ర్పూరం వాస‌న‌ స్వ‌ర్గానికి చెందిన‌దిగా అభివ‌ర్ణిస్తారు. దీన్ని మండిస్తే ఎలాంటి బూడిద రాకుండా పూర్తిగా మండిపోతుంది కనుక దీన్ని దేవుళ్ల‌కు పూజ‌లు చేయ‌డంలో వినియోగిస్తారు. క‌ర్పూరాన్ని వెలిగించ‌డం వ‌ల్ల దాని చుట్టూ ఉన్న వాతావ‌ర‌ణంలో పాజిటివ్ ఎన‌ర్జీ వ‌చ్చి, ఈ క్ర‌మంలో ఆ ఎన‌ర్జీ అంతా మ‌న‌లోకి వెళ్లి మ‌న‌కు అంతా మంచే జ‌రుగుతుంద‌ట‌. 
 
సినామోమ‌మ్ కంఫోరా అనే వృక్షం నుంచి తీసే ప‌దార్థంతో క‌ర్పూరం త‌యారు చేస్తారు. దీని నుంచి వ‌చ్చే పొగ‌ను పీల్చ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ట‌. క‌ర్పూరాన్ని వెలిగించ‌డం వ‌ల్ల వ‌చ్చే పొగ‌తో ఆస్త‌మా, టైఫాయిడ్‌, త‌ట్టు, ఆందోళ‌న‌, త‌త్త‌ర‌పాటు, హిస్టీరియా, కీళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. 
 
హారతి పొగ వ‌ల్ల చుట్టూ వాతావ‌ర‌ణంలో ఉండే బాక్టీరియా, క్రిములు, వైర‌స్‌లు నాశ‌న‌మ‌వుతాయి. అంతేకాకుండా దీని నుంచి జ్ఞాప‌క‌శ‌క్తి వృద్ధి చెందుతుంది. చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. క‌ర్పూరాన్ని వెలిగిస్తే అది ఎలాగైతే పూర్తిగా మండిపోతుందో అలాగే దానికి ఎదురుగా నిల‌బ‌డి పూజ చేసిన వారిలో ఉన్న ఇగో కూడా అలాగే మండిపోతుంద‌ని అంటారు. ఈ క్ర‌మంలో అలాంటి వారు ప‌రిశుద్ధుల‌వుతారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రజలకు శుభవార్త.. ఈ ఏడాది ముందే దేశాన్ని తాకనున్న రుతుపవనాలు

అడిగిన వెంటనే డబ్బు ఇవ్వలేదని ఆమెపై దాడి చేసి అత్యాచారం చేసాను: నిందితుడు రాహుల్

తెలంగాణాలో ఉన్న రాజకీయ పార్టీలు ఎన్నో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత - రంగంలోకి దిగిన సీఎం బాబు

బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా... 10 లక్షల ఫాలోయర్లు తగ్గిపోయారు...

అన్నీ చూడండి

లేటెస్ట్

వైశాఖ మాసం.. అష్టమి రోజున కాలభైరవ పూజ చేస్తే.. కుంకుమ దానంతో...?

23-04-2026 గురువారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

తెరుచుకున్న కేదార్‌నాథ్ ధామ్ ద్వారాలు -51 క్వింటాళ్ల పూలతో అలంకరణ

22-04-2026 బుధవారం ఫలితాలు - అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు

వైశాఖ మాసంలో ఆరుద్ర నక్షత్రం, స్కంధ షష్ఠి-శ్రీ రామాను జయంతి.. అన్నీ ఒకే రోజు..

తర్వాతి కథనం
Show comments