Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రిపూట హాయిగా నిద్రపట్టాలంటే..!?

Webdunia
బుధవారం, 17 సెప్టెంబరు 2014 (20:41 IST)
రాత్రిపూట హాయిగా నిద్రపట్టాలంటే వేళ ప్రకారం నిద్రించడం మొదటి సూత్రం. నిద్రకు ఉపక్రమించేందుకు ఒక నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించుకోవాలి. ఏ పరిస్థితుల్లోనూ వేళ తప్పవద్దు. సరైన నిద్రకు ఆహారనియమం కూడా ఎంతో అవసరం.
 
నిద్రచెడగొట్టే పానీయాలను గానీ ఘనపదార్థాలను కానీ తీసుకోకూడదు. అందువల్ల నిద్రకు భంగం వాటిల్లే అవకాశం ఉంది. టీ కాఫీలను ఎక్కువగా తాగరాదు. టీ కాఫీలకు బదులుగా బాదం మిల్క్ మొదలగునవి తీసుకోవచ్చు. 
 
గోరువెచ్చని పాలు గ్లాసుడు నిద్రించే ముందు రాత్రిపూట తాగితే మంచిది. పగటిసమయంలో ఎక్కువగా నిద్రపోరాదు. అందువల్ల రాత్రి నిద్రరాదు. ఒంటరిగా పడుకోవడంవల్ల నిదురరాకపోతే ఆత్మీయుల చెంత నిద్రించండి. 
 
నిద్రరాదని మొరాయిస్తే మీకు ప్రియమైన సంగీతాన్ని వింటూ మీకు తెలియకుండా నిద్రలోకి జారిపోండి. నిద్రమాత్రలకు దూరంగా వుండండి. వాటిని నిద్రకోసం వాడకూడదు. అలా వాడితే నిద్రమాత్రలు ఒంటికి అనారోగ్యం. 
 
నిదురించే ముందు ఎలాంటి ఆలోచనలు చేయరాదు. నిదురరాదని మొరాయిస్తే మీకు ఇష్టమైన పుస్తకాలు చదవండి. అలాచేస్తే చదువుతూనే నిద్రపోతారు. పదేపదే పడకస్థానాన్ని మార్చవద్దు. కొత్తప్రదేశం నిద్రకు ఇబ్బంది కలుగజేస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments