Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎరుపు రంగు పండ్లలో ఏమున్నదో తెలుసా? వాటిని తింటేనా?

Webdunia
శుక్రవారం, 30 నవంబరు 2018 (12:19 IST)
పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తినటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ముఖానికి మంచి మెరుపు వస్తుంది. శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు అందుతాయి. అవి ఏమిటో ఒకసారి చూద్దాం.
 
1. ఎరుపు రంగు పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ సి వంటివి క్యాన్సర్‌ను అడ్డుకుంటాయి. గుండె జబ్బులను దరిచేరకుండా కాపాడతాయి. చర్మ సంబంధ సమస్యలు దరి చేరనీయవు. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 
2. పుచ్చకాయలో గుండెకు మేలు చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ పండు రక్తపోటును నియంత్రిస్తుంది. అత్యధిక పొటాషియం కూడా పుచ్చకాయలో లభిస్తుంది.
 
3. ఎరుపు రంగు క్యాప్సికమ్ ఆరోగ్యానికి ఎంతో ఉపకరించే కూరగాయలలో ఒకటి. ఇందులోని సోడియం, పొటాషియం, మెగ్నీషియం బ్లడ్ ప్రెషర్‌ను నిలకడగా ఉంచుతుంది.
 
4. టమోటా వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇవి శరీరానికి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. ఇందులో ఉండే లైకోపిన్ శక్తివంతమైన యాంటీఆక్సిడంట్‌గా పని చేస్తుంది. టమోటాలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. టమోటాను రోజు తీసుకోవడం వల్ల నిత్య యవ్వనంగా కనిపిస్తారు.
 
5. యాంటీ ఆక్సిడెంట్స్, యాంధోసియానిన్ దానిమ్మలో అధికంగా ఉంటాయి. శరీరంలోని వాపులను నియంత్రించే గుణం ఈ పండు సొంతం. రక్తనాళాలలో అడ్డంకులను తొలగించే శక్తి దానిమ్మకు ఉంది. ఈ పండును తీసుకోవడం వల్ల  కీళ్లనొప్పులు, వాతం కూడా తగ్గుతాయి. ఇందులోని లైకోపిన్ క్యాన్సర్‌ను అడ్డుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్సర్ సోకి రూపురేఖలే మారిపోయిన కేజీఎఫ్ నటుడు

మంచి విషయం గురించి చెప్పినా విమర్శలు తప్పట్లేదు : హీరో నాని

'ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు'... రజనీకాంత్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

తర్వాతి కథనం
Show comments