Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనస తొనలు ఆరోగ్యానికి మంచివి... కానీ అమితంగా తింటేనా?

Webdunia
సోమవారం, 6 మే 2019 (20:33 IST)
పనసకాయ వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పనసలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మంచి ఆరోగ్యాన్నిస్తుంది. ఈ పండులో ‘ఎ',‘సి' విటమిన్లు స్వల్పంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం మెండుగా ఉండి ఆరోగ్యానికి బాగా సహాయపడుతాయి. ఐతే అమితంగా ఈ పండును తినరాదు. తక్కువగా తింటేనే మేలు కలుగుతుంది. 
 
లవణాలు, విటమిన్లు తక్కువ కాబట్టి, ఈ పండు జీర్ణం కావటం కాస్త కష్టం. పనస గింజల్లో తేమ చాల తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గింజలు ఇంకా కఠినంగా జీర్ణం అవుతాయి. చిన్నపిల్లల్లో జీర్ణశక్తి ఎక్కువ కాబట్టి ఈ పండు గింజలను కాల్చి తింటే, వారికంత అపకారం జరగదు. మరి పనసపండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
 
1. పనసపండులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ శక్తిని మెరుగు పరచును. అజీర్తి, అల్సర్లను కూడా నయం చేస్తుంది.
 
2. పనస పండు లోని యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్‌ క్యాన్సర్‌ వ్యాధిని నిరోధిస్తాయి. ఇందులో ఫైటోన్యూట్రియంట్స్  ఐసోఫ ఉన్నందున క్యాన్సర్ నివారణకు సహాయపడును. 
 
3. పొటాషియం మెండుగా లభించడం వల్ల అదిక రక్తపోటును తగ్గిస్తుంది. రక్తపోటు ఉన్నవారు పొటాషియం సమృద్ధిగా లభించే పనసపండును తీసుకుంటే సమస్య తీవ్రత తగ్గుతుంది. 
 
4. పనస తొనలు జ్వరం, డయారియా రుగ్మతలకు ఔషధంగా పనిచేస్తుంది.  ఆస్తమాతో బాధపడేవారికి పనస ఎంతో మేలు చేస్తుంది. పనస వేరును బాగా ఉడికించి దాని నుంచి వచ్చే రసం తీసుకుంటే ఆస్తమా అదుపులో ఉంటుంది.
 
5. జారుడు గుణము కలిగివున్నందున మలబద్దకం నివారించును. పనస పండులో విటమిన్ సి ఉన్నందున వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచును. బాగా ముగ్గిన పండు మనో ఉల్లాసాన్ని కలిగిస్తుంది. అలసటను తగ్గిస్తుంది.
 
6. చర్మ ఆరోగ్యాన్ని కలిగించే కణాలు త్వరగా నశించకుండా పనస కాపాడుతుంది. అలాగే ఇందులో వయసు మళ్లే లక్షణాలు తగ్గించే గుణాలు ఉన్నాయి.
 
7. పనసపండులో ఉండే న్యూట్రీషియన్ విటమిన్ ఏ ఐ విజన్ ను మెరుగుపరుస్తుంది. హెయిర్ క్వాలిటీని పెంచుతుంది. చర్మం మెరిసేలా చేస్తుంది.
 
8. ఈ పండులో అధిక మెగ్నీషియం మరియు క్యాల్షియం ఉండటం వల్ల ఎముకలకు బలాన్ని చేకూర్చడానికి సహాయపడుతుంది. మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం ఉన్న ఆహారాలను తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.
 
9. పనసపండులో ఉన్న ఖనిజలవణాలు థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీరంలో హార్మోన్ ఉత్పత్తులు సమతుల్యంగా ఉంచే థైరాయిడ్ గ్రంధి ముఖ్య పాత్ర వహిస్తుంది. 
 
10. పనసపండులో ఉండే ఐరన్, రక్తహీనత సమస్యను నివారిస్తుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడే వారు పనసపండు తినడం ఆరోగ్యానికి మంచిది. పనసలో ఉండే విటమిన్లు మరియు ఖనిజాలు శరీరంలో ఎముకల్లో రక్తం గడ్డకట్టకుండా, మరియు రక్తం సజావుగా ప్రవహించేందుకు సహాయపడుతుంది. రక్తం గడ్డకట్టే సమస్యను నివారిస్తుంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments