Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొవ్వు క‌రిగించే.. ఆహార ప‌దార్ధాలు ఇవే...

ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్‌లో కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్‌లు అంద‌రినీ వేధిస్తున్న స‌మ‌స్యలుగా ఉన్నాయి. దీనికి కార‌ణం స‌రైన ఆహార నియ‌మాలు పాటించ‌క‌పోవ‌డం, రెగ్యుల‌ర్‌గా వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల బ‌రువు పెరిగిపోతున్నారు. ఒక్క‌సారి బ‌రువు పెరిగిన త‌ర్వాత త‌

Webdunia
సోమవారం, 18 జులై 2016 (23:15 IST)
ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్‌లో కొలెస్ట్రాల్, బెల్లీ ఫ్యాట్‌లు అంద‌రినీ వేధిస్తున్న స‌మ‌స్యలుగా ఉన్నాయి. దీనికి కార‌ణం స‌రైన ఆహార నియ‌మాలు పాటించ‌క‌పోవ‌డం, రెగ్యుల‌ర్‌గా వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల బ‌రువు పెరిగిపోతున్నారు. ఒక్క‌సారి బ‌రువు పెరిగిన త‌ర్వాత త‌గ్గ‌డం చాలా క‌ష్ట‌మైన‌ప‌ని. కొన్ని సంద‌ర్భాల్లో కొంత‌మంది ఎన్ని విధాలుగా ప్ర‌య‌త్నించినా.. బ‌రువు త‌గ్గ‌క‌పోవ‌డంతో చాలా ఇబ్బందులు ప‌డుతుంటారు. అయితే శ‌రీరంలో కొవ్వు పేరుకుపోవ‌డానికి కార‌ణ‌మ‌య్యే ఆహార‌ప‌దార్థాల గురించి తెలుసుకుంటే.. బ‌రువు పెర‌గ‌కుండా.. కొలెస్ట్రాల్‌కి దూరంగా ఉండ‌వ‌చ్చు. అలాగే కొన్ని ఆహారాల ద్వారా కొవ్వు క‌రిగించుకోవ‌డం కూడా చాలా సులువుగా చేసుకోవ‌చ్చు.
 
* ఓట్స్ కొవ్వును తగ్గించడంలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది. దీని ద్వారా రోజుకి 25 నుంచి 35 గ్రాముల ఫైబర్ పొంద‌వ‌చ్చు. కాబ‌ట్టి  ఓట్స్‌ను రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువుకి చెక్ పెట్ట‌వ‌చ్చు.
 
* గ్రెయిన్స్ బార్లీ, ఓట్స్ వంటి ఓల్ గ్రైన్స్‌ గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడ‌తాయి. గ్రైన్స్ వల్ల‌ శరీరంలో చెడు కొవ్వు పదార్థాలు త‌గ్గుతాయి. దీని వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని త‌గ్గాంచుకోవ‌చ్చు.
 
* అవ‌కాడోలో గుండె ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి.
 
* బీన్స్‌లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ర‌క‌ర‌కాల రూపాల్లో ల‌భించే బీన్స్ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర బ‌రువు త‌గ్గించుకోవచ్చు. కొవ్వు ప‌దార్థాల‌ను క‌రిగించుకోవ‌చ్చు
 
* పండ్లు యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొవ్వు ప‌దార్థాల స్థాయిలు త‌గ్గుతాయి. అలాగే ఆహారం సులువుగా జీర్ణ‌మ‌వుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

తర్వాతి కథనం
Show comments