Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ మహిళ ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

గర్భం దాల్చడం అనేది స్త్రీకి భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం. అయితే స్త్రీ గర్భం దాల్చినప్పుడు తన ఆరోగ్యం విషయంలో చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎలాంటి ఆహారం తీసుకోవచ్చో, ఎలాంటి ఆహారం తీసుకోకూడదో అని కొంతమంది సరిగా తినకుండా ఉంటారు. ఈ విషయంలో జాగ్రత్త

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (17:16 IST)
గర్భం దాల్చడం అనేది స్త్రీకి భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం. అయితే స్త్రీ గర్భం దాల్చినప్పుడు తన ఆరోగ్యం విషయంలో చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎలాంటి ఆహారం తీసుకోవచ్చో, ఎలాంటి ఆహారం తీసుకోకూడదో అని కొంతమంది సరిగా తినకుండా ఉంటారు. ఈ విషయంలో జాగ్రత్త కొంతవరకు అవసరమే.


కానీ ప్రెగ్నెన్సీ సమయంలో తగినంత బరువు ఉండకపోతే నెలలు నిండకముందే ప్రసవించే అవకాశాలు ఉంటాయని అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా సిజేరియన్ చేయాల్సిన అవకాశం ఏర్పడుతుందని వెల్లడయ్యింది. ఈ సమస్య నుండి బయటపడాలంటే  గర్భవతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
1. గర్భం దాల్చిన మహిళలకు పప్పుధాన్యాలతో చేసిన జావలు సురక్షితమైనవి. గర్భం దాల్చినవారికి వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ వెల్లుల్లిని శరీరానికి వేడిని కలిగిస్తుంది కాబట్టి చలువ పదార్థాలని కూడా తీసుకోవాలి. వీటితో పాటు జామపండు కూడా తల్లికి గర్భంలో ఉన్న శిశువుకి మంచి పోషకాలను అందిస్తుంది.   
 
2. గర్భం ధరించింది మొదలు ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి. ఇష్టం లేని రూపాలను, దుర్గంధాలను, భయంకర దృశ్యాలను చూడకూడదు. శుభ్రమైన గాలిలో, సూర్యరశ్మిలో ఉండాలి.
 
3. గర్భం దాల్చినవారు వదులైన, అనుకూలమైన దుస్తులు ధరించాలి. మధ్యాహ్న సమయమందు 2 గంటలు, రాత్రి సమయమందు 8 గంటలు విశ్రాంతిని పొందాలి. 
 
4. గర్భిణీ స్త్రీలు కాఫీని సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదు. పాలల్లో కుంకుమ పువ్వు వేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
 
5. గర్భవతులు తమ కడుపులో ఒక శిశువు పెరుగుతున్నాడనీ, తల్లీపిల్లల ఇద్దరి పెరుగుదలకు కావలసిన ఆహారం తీసుకోవలసిన వైనం గుర్తించుకుని సరియైన ఆహారాన్ని తీసుకోవాలి. ఎప్పటికప్పుడు తగినంత బరువు ఉండేలా చూసుకోవాలి.
 
6. ఏడవ మాసము వరకు ప్రతి మాసానికోసారి వైద్యుని సంప్రదించి సలహా పొందాలి. 8వ మాసము నుండి ప్రతి పదిహేను రోజులకోసారి, 9వ మాసము నుండి ప్రతి వారానికోసారి వైద్యుని సంప్రదించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థల పరిశీలన : మంత్రి టీజీ భరత్

తమ్ముడి అంత్యక్రియల్లో సీఎం చంద్రబాబు నాయుడు (Video)

ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్లు నెలకు ఒకసారైనా ఉతుకుతారు : రైల్వే మంత్రి

కేరళ సంప్రదాయ చీరకట్టులో ప్రియాంక.. లోక్‌సభ సభ్యురాలిగా... (Video)

ప్రియురాలిని హత్య చేసి ఆమె శవం పక్కనే 24 గంటలు, ఆ తర్వాత?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ధనుష్ - ఐశ్వర్యలకు విడాకులు - చెన్నై కోర్టు తీర్పుతో ముగిసిన వివాహ బంధం

అఖిల్, నాగ చైతన్య వివాహాలు ఒకే వేదికపై జరుగుతాయా? నాగ్ ఏమంటున్నారు?

తర్వాతి కథనం
Show comments