Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుడ్డుకు - పక్షవాతానికి లింకేంటి?

అనేక పోషక విలువలు కలిగి పేదవాడికి మాంసాహారంతో సమానమైనది కోడిగుడ్డు. ఈ కోడిగుడ్డు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిల్లల శారీరక ఎదుగుదలకు సైతం ఇది ఎంతగానో దోహదపడుతుంది.

Webdunia
గురువారం, 27 సెప్టెంబరు 2018 (11:16 IST)
అనేక పోషక విలువలు కలిగి పేదవాడికి మాంసాహారంతో సమానమైనది కోడిగుడ్డు. ఈ కోడిగుడ్డు ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిల్లల శారీరక ఎదుగుదలకు సైతం ఇది ఎంతగానో దోహదపడుతుంది. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఉడికిన కోడిగుడ్డును ఆరగిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు. పిల్లలేకాకుండా పెద్దలు, వృద్ధులూ కోడిగుడ్డును ప్రతిరోజూ తీసుకోవాల్సిందిగా నేషనల్‌ ఎగ్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ (ఎన్‌ఈసీసీ) ప్రచారం చేస్తోంది.
 
శాఖాహారులు సైతం కోడిగుడ్డు తినొచ్చనేది వైద్యుల సూచన. కోడిగుడ్డును మాంసాహారంగా గుర్తించడంలో ఔచిత్యం లేదన్నది శాస్త్రీయ ఆలోచనాపరుల వాదన. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్య పరిరక్షణ కోసం అన్ని వయస్కుల వారూ ప్రతిరోజూ గుడ్డు తీసుకోవాల్సిందే. అలా రోజూ గుడ్డు తినేవారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.  
 
* గుడ్డు పోషకాల నిలయం. ఇందులో మాంసకృత్తులు (ప్రోటీన్‌), అత్యవసరమైన 9 అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్‌ విటమిన్లు, డి విటమిన్‌, ఖనిజాలు దండిగా ఉంటాయి. 
* గుడ్డు తింటే బరువు పెరుగుతుందని చాలామంది భావిస్తుంటారు. దీనికి కారణం పచ్చసొనలోని కొలెస్ట్రాలే. 
* గుడ్డులో కొలెస్ట్రాల్‌ స్థాయులు ఎక్కువగా ఉన్నప్పటికీ.. దీంతో రక్తంలో కొలెస్ట్రాల్‌ మోతాదులు అంత ఎక్కువగా ఏమీ పెరగటం లేదని అధ్యయనాలు చెబుతున్నాయి. 
* గుడ్డులో కేలరీలు తక్కువ. పైగా చాలాసేపటి వరకు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఫలితంగా త్వరగా ఆకలి వేయదు. ఇది పరోక్షంగా బరువు తగ్గటానికీ తోడ్పడుతుందన్నమాట. 
* కణాల పనితీరు, వాటి ఎదుగుదల, శక్తిని అందించటంతో పాటు శరీరంలో జరిగే పలు జీవక్రియలకు అవసరమైన పోషకాలు గుడ్డుతో లభిస్తాయి. 
* దీని పచ్చసొనలోని ఐరన్‌ మన శరీరం తేలికగా గ్రహించటానికి అనువుగానూ ఉంటుంది. 
* గుడ్డులోని ల్యూటీన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్స్ కంటి జబ్బుల ముప్పు తగ్గటానికి తోడ్పడుతుంది. వృద్ధాప్యంలో మెదడు ఆరోగ్యంగా ఉండటానికీ ఇది దోహదం చేస్తుంది. 
* రోజుకు ఒక గుడ్డు తినేవారిలో పక్షవాతం ముప్పు 12 శాతం వరకు తగ్గుతున్నట్టు ఒక పరిశోధనలో వెల్లడైంది.

సంబంధిత వార్తలు

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

ఏపీలో పోలింగ్ తర్వాత తిరుమలకు రేవంత్ రెడ్డి

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

తర్వాతి కథనం
Show comments