Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండు ద్రాక్షతో ఏంటి ఉపయోగం...

Webdunia
మంగళవారం, 18 డిశెంబరు 2018 (11:58 IST)
ఎండు ద్రాక్షలను పలురకాల స్వీట్లలో వంటకాల్లో వాడుతుంటాం. వీటి వలన వంటకాలకు చక్కని రుచి వస్తుంది. ఈ ఎండు ద్రాక్షలలో పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటే తెలుసుకుందాం.
 
1. ఎండుద్రాక్షలను రాత్రంతా నీటిలో నానబెట్టుకుని ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే అనారోగ్య సమస్యలు  దరిచేరవు.
 
2. ఎండుద్రాక్షాలలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. అందువల్ల రక్తహీనతను నివారించుటలో సహాయపడుతుంది. అంతేకాకుండా  ద్రాక్షాలలో విటమిన్ బి, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
 
3. గుండె సంబంధిత వ్యాధులకు ఈ ఎండుద్రాక్షాలు ఎంతోగానో ఉపయోగపడుతుంది. ఉదయాన్నే వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఉత్తేజంగా ఉంటారు. ఇది ఒక రోజుకు కావలసిన శక్తిని అందిస్తుంది. ఈ ఎండుద్రాక్షాలు తీసుకోవడం వలన ఉద్యోగులు, పిల్లలు అనారోగ్య సమస్యల నుండి విముక్తి చెందుటకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అధిక బరువును కూడా సులభంగా తగ్గించుటలో ఎంతగానో దోహదపడుతుంది.
 
4. ఎండుద్రాక్షాలతో పాటు వెల్లుల్లిని కూడా పచ్చిగా తీసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది. 
 
5. వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పలు రకాల క్యాన్సర్ వ్యాధుల నుండి కాపాడుతాయి. వీటిని తీసుకోవడం వలన జీర్ణ సంబంధ సమస్యలు కూడా తొలగిపోతాయి. వీటిల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి. పలు రకాల ఇన్‌ఫెక్షన్స్‌తో బాధపడేవారు ఎండుద్రాక్షాలు తీసుకుంటే అలాంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చును.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

Janu lyri: జానును పెళ్లి చేసుకోబోతున్న సింగర్ దిలీప్.. ఇద్దరూ చెప్పేశారుగా! (video)

తర్వాతి కథనం
Show comments