గసగసాలు చేసే మేలు ఏమిటి?

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2022 (16:01 IST)
మసాలా దినుసుల్లో ముఖ్యమైనవి గసగసాలు. గసగసాలను కేవలం ఔషధంగా అప్పుడప్పుడు వాడుకోవడం మంచిది. గసగసాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
గుండె సమస్య ఉన్న వారు గసగసాలు దోరగా వేయించి పంచదార కలిపి ఉదయం, సాయంత్రం అర చెంచాడు తీసుకుంటే గుండెకు మంచిది.
 
కడుపులో మంట ఉన్న వారు ఎసిడిటీ వున్న వారు దీనిని వాడితే పేగులలోని పుండు కూడా తగ్గుతుంది.
 
గసగసాలు చలువ చేసే గుణాన్ని కలిగి వుంటాయి. తరచు వేడి చేసేవారు వీటిని వాడటం వలన వేడి తగ్గుతుంది.
 
విరేచనాలు అవుతున్నప్పుడు గసగసాలను దోరగా వేయించి నీటితో కలిపి నూరి ఆ రసాన్ని తేనెతో గాని లేక పంచదారతో కాని తీసుకోవాలి.
 
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వలన మంచి నిద్ర సొంతం అవుతుంది.

గసగసాలుకి శ్వాస సంబంధిత రుగ్మతలు తగ్గించే సామర్థ్యం వుంది. దగ్గు, దీర్ఘకాలిక ఆస్తమా నుండి ఉపశమనం కలిగిస్తాయి.
 
మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్ళ ఏర్పాటును నివారించే శక్తిని గసగసాలు కలిగి ఉంటాయి.
 
గసగసాలు అతిగా వాడటం వలన మగవారిలో వీర్య నష్టము జరుగుతుంది. కాబట్టి వీటిని అతిగా వాడకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

3 కోట్ల ఐఆర్‌సీటీసీ ఖాతాలు డీయాక్టివేట్ చేసిన రైల్వే శాఖ

హిందూయేతర ఉద్యోగుల సమస్యను టీటీడీనే స్వయంగా పరిష్కరించుకోవాలి

ఐఫాతో తెలంగాణ ప్రభుత్వం కీలక బహుళ-వార్షిక ప్రపంచ స్థాయి భాగస్వామ్యం

వెయ్యి మంది జగన్‌లు వచ్చినా అమరావతిని కదల్చలేరు.. మంత్రి పెమ్మసాని

బీజేపీకి సరెండర్ కావాలనుకుంటున్న వైకాపా.. కౌంటరిచ్చిన ప్రధాన మంత్రి మోదీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

తర్వాతి కథనం
Show comments