Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముక్కు నుంచి నీళ్లు కారటం, తుమ్ములు తగ్గాలంటే?

Webdunia
మంగళవారం, 17 మే 2022 (23:14 IST)
ఆరోగ్యానికి లవంగాలు ఎంతో మేలు చేస్తాయి. మోక్షప్రదంగా ఉపకరించే పరమపవిత్రమైన అత్యంత శక్తివంతమైన స్వామివార్ల తీర్ధాన్ని తయారుచేయటానికి లవంగాలు ప్రముఖపాత్ర వహిస్తాయి. 2. 5 మి.లీ. నువ్వుల నూనెలో ఒక లవంగాన్ని నలగ్గొట్టి వేసి వెచ్చజేసి చల్లార్చిన నూనెను రెండుమూడు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవి పోటు తగ్గుతుంది.

 
లవంగాలు దాల్చిన చెక్క, పసుపు, జాపత్రి చూర్ణాలను ఒక్కొక్కటి 10 గ్రా చొప్పున కలిపి ఉంచుకొని రోజు రెండు పూటలా పూటకు 4,5 చిటికెల పొడిని తగినంత తేనెతో కలిపి సేవిస్తుంటే ముక్కు నుంచి నీళ్లు కారటం, తుమ్ములు, ముక్కు, కళ్లు దురదలుపెట్టడం, జలుబు వంటి సమస్యలు తగ్గిపోతాయి.

 
లవంగాల చూర్ణానికి సమానంగా నల్లజీలకర్ర చూర్ణాన్ని కలిపి ఉంచుకొని రోజు ఒకసారి తగినంత పొడిలో నీరు కలిపి పేస్టులా చేసి ముఖానికి పలుచగా పట్టించి అరగంట ఆగి గోరువెచ్చని నీటితో కడుక్కుంటుంటే వేధించే మెుటిమల సమస్య తగ్గిపోతుంది. లవంగ నూనెలో తడిపిన దూదిని పిప్పి పంటిపై ఉంచితే తక్షణమే నొప్పితగ్గిపోతుంది.

 
లవంగాల చూర్ణం, మిరియాల చూర్ణాలను పది గ్రాముల చొప్పున కలిపి ఉంచుకొని ఉదయం, రాత్రి పూట 4,5 చిటికెల పొడిని  పావు టీ స్పూన్ నెయ్యి, అర టీ స్పూన్ తేనె కలిపి సేవిస్తుంటే శ్లేష్మం తెగి పడిపోతుంది. గొంతులో గురగుర తగ్గిపోతుంది. దగ్గు, ఆయాసం నెమ్మదిస్తాయి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments