భోజనం చేసిన వెంటనే వాకింగ్ చేస్తున్నారా?

Webdunia
శనివారం, 5 జూన్ 2021 (17:32 IST)
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే భోజనం చేసిన తర్వాత ఇలా చేయకూడదు. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత కొన్నింటిని తినకుండా వుంటే బరువు పెరగడం, పొట్ట పెరగడం సమస్యలను నియంత్రించుకోవచ్చు.
 
భోజనం చేసే ముందు లేదా తర్వాత పండ్లు ఎక్కువగా తినకూడదు. ఇలా తింటే పొట్ట బాగా పెరుగుతుంది.
 
అన్నం తిన్న వెంటనే టీ తాగకూడదు. అలా చేస్తే తేయాకులో వుండే ఆమ్లాలు ఆహారంలో వుండే మాంసకృత్తును శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయి.
 
తినగానే స్నానం చేయకూడదు. దానివల్ల కాళ్లు, చేతుల్లోకి రక్తప్రసరణ పెరుగుతుంది. అందువల్ల పొట్ట చుట్టూ రక్తప్రసరణ తగ్గి, జీర్ణవ్యవస్థ పనితీరు మందగిస్తుంది.
 
భోజనం అయ్యాక పది నిమిషాలు పాటు నడిస్తే మంచిదంటారు. కానీ అలా నడవడం వల్ల పోషకాలను గ్రహించడంలో జీర్ణవ్యవస్థ విఫలమవుతుంది. తిన్న వెంటనే కాకుండా, పది నిమిషాల తర్వాత నడిస్తే మంచిది.
 
అన్నింటికంటే ముఖ్యంగా తినగానే నిద్రపోకూడదు. అలా నిద్రపోతే తిన్న ఆహారం జీర్ణమవ్వక ఇబ్బందులు తలెత్తుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

80 లక్షల ప్యాకేజీ, అమెరికాలో ఇల్లు.. రహస్య వివాహం.. సహజీవన భాగస్వాముల ఆత్మహత్య

కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి దాడి చేసి.. చంపేసింది..

అమరావతికి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం

కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. 1200 మంది ఆత్మ బలిదానంతో తెలంగాణ వచ్చింది..

అమరావతి మహిళల కన్నీళ్లే ఈ చట్టానికి పునాది : కేంద్ర మంత్రి పెమ్మసాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏ మతాన్ని తక్కువ చూపించలేదు : టొవినో థామస్- కెరీర్ లో స్పెషల్ మూవీ: కయదు లోహర్

King 100: నాగార్జున, టబు కాంబినేషన్ లో కింగ్ 100 చిత్రం షూటింగ్

NTR: ఎన్టీఆర్ చిత్రం డ్రాగన్ లో నటించడంలేదంటున్న టోవినో థామస్

Akhil: లెనిన్ తర్వాత అఖిల్ చిత్రం ఎవరితో అనేది క్లారిటీ వచ్చిందా !

స్వర్ణ దేవాలయంలో అంట్లు తోముతున్న ప్రియాంకా చోప్రా

తర్వాతి కథనం
Show comments