బస్సు ఎక్కితే వాంతులు... రాకుండా చేయడమెలా?

చాలామందికి బస్సు ప్రయాణం పడదు. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు, కడుపులో తిప్పినట్లుగా ఉంటుంది. దాని ఫలితంగా వాంతులు అవుతుంటాయి. ఎక్కువగా ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసేటప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలా చాలామందికి వాహనాల ప్రయాణం సమయంలో వాంతులు అవుతుం

Webdunia
శనివారం, 17 జూన్ 2017 (13:55 IST)
చాలామందికి బస్సు ప్రయాణం పడదు. బస్సులో ప్రయాణం చేసేటప్పుడు, కడుపులో తిప్పినట్లుగా ఉంటుంది. దాని ఫలితంగా వాంతులు అవుతుంటాయి. ఎక్కువగా ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసేటప్పుడు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలా చాలామందికి వాహనాల ప్రయాణం సమయంలో వాంతులు అవుతుంటాయి. అలాంటి వారు ప్రయాణానికి ముందు కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్య రాదంటున్నారు వైద్యులు. 
 
చిన్న అల్లం ముక్కను బుగ్గ లోపల పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం చాలా తక్కువ. అలాగే అల్లంలో కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, జింక్ వంటివి మన శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. వక్కపొడిని చప్పరించినా వాంతుల నుంచి బయట పడవచ్చు. 
 
నిమ్మకాయను కొద్దికొద్దిగా నలుపుతూ ముక్కు దగ్గర పెట్టుకుని వాసన పీలిస్తే కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. లవంగాలు, సోంపు వంటివి దవడలో పెట్టుకుని చప్పరించినా కూడా వాంతులు రాకుండా వుంటాయి. వాంతులు ఎక్కువగా వచ్చేవారు కారు, బస్సు ఎక్కినప్పుడు ముందు సీట్లో కూర్చుని పరిసరాలను గమనిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Narendra Modi: వీధికుక్కల బెడదను పరిష్కరించేందుకు కేంద్రం చర్యలు

Janasena: భీమవరంతో పవన్ కల్యాణ్‌కు ఇబ్బందులు.. పేకాట క్లబ్‌లపై కొరడా

తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. చివరి దశ పోలింగ్ ప్రారంభం

వాష్ రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్న బాలుడు.. కారణం ఏంటి?

ESIC Hospital: 100 పడకల ఈఎస్‌ఐసీ ఆసుపత్రి నిర్మాణానికి కేంద్రం ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Legendary Biopic: ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో సాయిపల్లవి లేదా కీర్తి సురేష్?

మంచి–చెడు మధ్య హైడ్ అండ్ సీక్ డ్రామాగా పోలీస్ కంప్లైంట్ టీజర్

గుర్రం పాపిరెడ్డి లాంటి చిత్రాలను ఆదరిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది : బ్రహ్మానందం

గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్... వృషభను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది

Boyapati: అవెంజర్స్ కి స్కోప్ ఉన్నంత సినిమా అఖండ 2 తాండవం : బోయపాటి శ్రీను

తర్వాతి కథనం
Show comments