Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగవారు ధనియాలు తింటే?

Webdunia
సోమవారం, 22 మే 2023 (22:53 IST)
ధనియాలు. మసాలలో వీటిని విరివిగా వాడుతుంటారు. ధనియాల తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. నిద్రలేమితో బాధపడే వారు ధనియాల కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని తాగితే నిద్ర బాగా పడుతుంది. ధనియాలు, జీలకర్ర, బెల్లం కలిపి నూరుకుని గుళికల్లా చేసుకొని మూడు పూటలా ఒక్కోటి వేసుకొంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
గర్భవతులు తమ ఆహారంలో ధనియాలు తీసుకోవడం వల్ల గర్భకోశానికి ఎంతో మేలు కలుగుతుంది.
 
అజీర్తితో బాధపడేవారు ధనియాలు శుభ్రం చేసి తగినంత ఉప్పు కలిపి దోరగా వేయించి మిక్సీలో వేసి పొడిచేసి రోజూ ఆ పొడి వాడితే సమస్య తగ్గుతుంది. కడుపులో మంట, కడుపు నొప్పి, తలనొప్పి, మలబద్ధకం వున్నవారు ధనియాల పొడిని మజ్జిగలో కలుపుకొని త్రాగితే తగ్గిపోతుంది.
బియ్యం కడిగిన నీటిని కలిపి ధనియాలు మెత్తగా నూరి, ముద్ద చేసి దానికి పటికబెల్లం చేర్చి కొద్ది మోతాదుల్లో తింటే పిల్లలకు తరచూ వచ్చే దగ్గు, ఆయాసం తగ్గుతాయి. వేసవిలో ఉదయాన్నే ధనియాలు తీసేసిన ఆ నీటిలో చక్కెర, పచ్చకర్పూరం వేసుకుని తాగితే శరీరానికి మంచిది.
ధనియాలు తీసుకోవడం వల్ల స్త్రీలతో పాటు పురుషులకు కొత్త శక్తి వస్తుంది, మేలు చేస్తుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments