Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి రసాన్ని తీసుకుంటే...

మన పెరట్లో దొరికే దివ్యౌషధం తులసి. ఇంట్లో ఎప్పుడూ ఉండదగిన ఔషధం. సరే.. ఇదంతా తులసి మొక్కకు ఉన్న ప్రాధన్యత ఇక ఇందులో ఉన్న ఔషధ గుణాలేంటో... దీన్ని ఎన్ని రకాలుగా వినియోగించుకోవచ్చో తెలుసుకుందాం. * కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయ

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (22:16 IST)
మన పెరట్లో దొరికే దివ్యౌషధం తులసి. ఇంట్లో ఎప్పుడూ ఉండదగిన ఔషధం. సరే.. ఇదంతా తులసి మొక్కకు ఉన్న ప్రాధన్యత ఇక ఇందులో ఉన్న ఔషధ గుణాలేంటో... దీన్ని ఎన్ని రకాలుగా వినియోగించుకోవచ్చో తెలుసుకుందాం.
 
* కొన్ని తులసి ఆకులను రాత్రి నీటిలో నానబెట్టి ఆ నీటితో ఉదయం పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన, నోటిపొక్కులు తగ్గుతాయి.
* ఉదయాన్నే తులసి ఆకులను పిడికెడు దంచి కషాయంగా కాచి కానీ, లేదా ఆ రసం లో ఒక చెంచా తేనె చేర్చి కానీ తాగితే కఫం తగ్గుతుంది.
* తులసి ఆకుల రసంలో తేనెని కలిపి రోజుకి రెండు సార్లు చొప్పున తీసుకుంటే దగ్గు, జలుబు తగ్గుతాయి.
* జలుబు, దగ్గుతో భాదపడే వారు ఒక టీ స్పూను శొంఠి, ఒక టీ స్పూను మిరియాల పొడి, అయిదు నుంచి పది తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని(కషాయం) తాగితే ఫలితం ఉంటుంది.
* కళ్ళు మంటలు, కళ్ళవెంట నీరు కారడంలాంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని దూదితో కను రెప్పల మీద రాసి చూడండి (కంట్లో పడకుండా జాగ్రత్త వహించండి).
* తులసి ఆకుల రసానికి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచే గుణం ఉంది. తులసి ఆకులు, పుదీనా ఆకులు కలిపి కషాయంగా కాచి తాగితే రోజు వారీ వచ్చే జ్వరం తగ్గుతుంది.
* తులసి ఆకుల్ని నీళ్ళలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలిస్తే గొంతు నొప్పులు తగ్గుతాయి.
* తులసి రసాన్ని తేనెతో కలిపి ఒక స్పూను ప్రతిరోజూ తాగితే నోటి పూత, గొంతునొప్పి, బొంగురుపోయిన గొంతు సాఫీగా ఉంటుంది.
* తులసి రసం, ఉల్లిపాయరసం, అల్లం రసం, తేనె కలిపి ఆరు చెంచాలు రెండుపూటలా తాగితే విరేచనాలు, రక్తవిరేచనాలు అరికడుతుంది.
* తులసి శరీరంలో ఉండే అధిక కొవ్వును నివారిస్తుంది., తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు. 
* నిద్రలేమితో బాధపడేవారికి తులసి గొప్ప ఔషధం. అడవి తులసి రసాన్ని పంచదారతో కలిపి ప్రతిరోజూ రాత్రి పడుకోబోయే ముందు రెండు చెంచాలు తాగితే చక్కగా నిద్రపడుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

తర్వాతి కథనం
Show comments