తినగానే కడుపు ఉబ్బరంగా వున్నట్లనిపిస్తుంది, ఎందుకు?

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (21:38 IST)
కడుపు ఉబ్బరం.. అదే గ్యాస్ట్రిక్ సమస్య. దీనిని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలంగా పెద్ద అనారోగ్య సమస్యగా మారే ప్రమాదం ఉంది. అందుకే దాన్ని తగ్గించుకునేందుకు వంటింట్లో దొరికే దినుసులతోనే చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అల్లంపొడి, వాముపొడి, కాస్త ఉప్పు.. ఈ మూడింటినీ నిమ్మరసంలో కలిపి గోరువెచ్చని నీటితో సేవిస్తే ప్రయోజనం ఉంటుంది.
 
ఇలాకాకపోతే యాలకుల పొడి, ఇంగువ, శొంఠి, చక్కెర, ఉప్పుల మిశ్రమాన్ని ఒక గ్లాసు పల్చటి మజ్జిగలో కలుపుకుని తాగొచ్చు. ఇంకా మరొక పద్ధతి కూడా ఉంది. యాభై గ్రాముల చొప్పున సోంపు, శొంఠి, పచ్చి జీలకర్ర, పటికబెల్లం వేరువేరుగా పొడులు కొట్టుకొని వేరువేరు డబ్బాలలో నిల్వ చేసుకోవాలి. మూడుపూటలా భోజనం చేశాక... అన్ని పొడులు కలిపి ఒక స్పూను పొడిని నీటిలో వేసుకుని తాగాలి.
 
దీనివల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం తగ్గుతాయి. ఇవన్నీ చేసుకునే తీరిక లేకపోతే ఆయుర్వేద ముందుల దుకాణాల్లో హింగ్వాష్టక చూర్ణం దొరుకుతుంది. ఒక స్పూను పొడిని అన్నం తినేప్పుడు తొలిముద్దలో పెట్టుకుని ఆరగిస్తే మరీ మంచిది.
 
ఇవన్నీ చేస్తునే పొద్దున్నే నడక తప్పనిసరి చేయాలి. వేపుళ్లు, పచ్చళ్లు, నూనెలో వేగించిన మాంసాహారం, అధిక మసాలాలు తినడం, శీతల పానీయాలు, పదేపదే కాఫీలు తాగడం మానేయాలి. అప్పుడే గ్యాస్ట్రిక్ నుంచి విముక్తి దొరుకుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రపంచంతో ఆడుకుంటున్న ఇరాన్, మళ్లీ హర్మూజ్ జలసంధిని మూసేసింది

హృద్యమైన ప్రేమకథ.. ఎత్తు లేకపోతేనేం.. పర్లేదు వివాహం చేసుకున్న యువతి

చున్నీ వేసుకోమన్నందుకు ద్వారకా తిరుమల మహిళా సెక్యూరిటీ గార్డుపై దాడి, వీడియో

పాదయాత్ర చేస్తా, మావిగన్ గురించి ప్రజలకు వివరిస్తా: జగన్ ప్రకటన

భర్తకు కిడ్నీ దానం చేయాలట.. భార్యాభర్తల మధ్య నిద్రపోతున్న అత్త .. ఫోటోలు తీసే మామ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుసగా రూ.100 కోట్ల చిత్రాలు.. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ప్రదీప్‌కు కలిసొస్తుందా?

Lokesh Kanagaraj: ఈ ఏడాదిలోనే అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ చిత్రం షూటింగ్

Dhanush: ధనుష్ కారాలోని కన్నమ్మా ఎన్ కన్నమ్మ పాట 1 మిలియన్ వ్యూస్ దాటింది

Ramya Krishna: అల్లు అర్జున్.. రాకా లో రమ్యక్రిష్ణ - ఏడు విదేశీ భాషలలో విడుదలకు సన్నాహాలు

Thiruveer: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ ల చిత్రం ఓ..! సుకుమారి షూటింగ్ పూర్తి

తర్వాతి కథనం
Show comments