Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుకోవటానికి చిట్కాలు

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (08:45 IST)
మనిషి శరీరాన్ని వ్యాధుల నుండి కాపాడటానికి కంచు కోటలా కాపలా కాసే సైనికుల్లా రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు పని చేస్తాయి. మన శరీరంలో రోగ నిరోధక శక్తిలో ఈ తెల్ల రక్త కణాలు పనిచేస్తాయి. ఇవి కూడా ఎర్ర రక్త కణాలు లాగానే ఎముక మద్య భాగంలో ఏర్పడతాయి. ఇవి నిరంతరం రక్త ప్రవాహంలో కలిసి రోగాల పై పోరాడతాయి. అటువంటి క్రమంలో కొన్ని సార్లు వీటి సంఖ్య తగ్గుతుంది.
 
తెల్ల రక్త కణాలు తగ్గడం వల్ల శరీరం క్రమంగా క్షీణిస్తుంది. అలసట, శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు, బద్ధకం గా ఉండటం, తరచుగా వ్యాధుల బారిన పడటం వంటి లక్షణాలు కనపడతాయి. అయితే వీటికి కొన్ని రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటి ఆక్సిడెంట్ లు, తగు మోతాదులో మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వీటి సంఖ్యను పెంచుకోవచ్చు. ఆహార పదార్థాలు ఏమిటంటే విటమిన్ ఇ ఎక్కువగా ఉండే క్యారెట్, బీట్ రూట్ వంటివి తీసుకోవాలి. మరియు జింక్ అధిక మొత్తంలో లభించే గుమ్మడికాయ, పుచ్చకాయ, వెల్లుల్లి వంటివి ఎంతో ఉపయోగం.
 
విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ, బత్తాయి, నారింజ, బొప్పాయి వంటివి అధిక మొత్తంలో తీసుకోవాలి. గ్రీన్ టీ తీసుకోవడం ద్వారా యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. పాలకూర, బ్రకోలి, చిలకడ దుంపల్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ లు రాకుండా నివారిస్తాయి. ఇంకా చేపలు, పాలు, పాల ఉత్పత్త్హులు వంటి వాటిలో తెల్ల రక్త కణాలను పెంచే విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

తర్వాతి కథనం
Show comments