మధుమేహం వస్తే తగ్గించుకోవడం ఎలా?

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (21:32 IST)
మధుమేహం వ్యాధి భారినపడితే జీవితాంతం పాటూ మందులు వాడాల్సిందే. మందులు వాడినప్పటికి మనం తీసుకునే ఆహారంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసిందే. రక్తంలోని చక్కెర స్థాయిలు పెరుగుతున్నట్లయితే, మొదటగా తీసుకునే ఆహారంలో మార్పులు చేయాలి. మంచి పోషకాహార నిపుణుడిని కలిసి ఆహార ప్రణాళికను రూపొందించుకోండి. నాణ్యమైన మరియు పరిమిత మోతాదులో తినటం వలన అనుకూల ఫలితాలను పొందుతారు. అదనంగా, కార్బోహైడ్రేట్లను తగ్గించి వీటికి బదులుగా ప్రోటీన్లను తీసుకుంటే చాలా మంచిది.
 
మధుమేహ వ్యాధిని తగ్గించే ప్రణాళికలో వ్యాయామాలు ముఖ్యమనే చెప్పాలి. 30 నిమిషాల ఏరోబిక్ వ్యాయామాల వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు తగ్గటమే కాకుండా, ముఖ్యమైన కణజాలాలను మరింత సున్నితంగా మారుస్తుంది. వ్యాయామాల వలన మధుమేహ వ్యాధి మాత్రమే కాక పూర్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
 
రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గించే అందుబాటులో ఉన్న మరొక సులువైన మార్గం బరువు తగ్గటం. బరువు తగ్గటం వలన ఇన్సులిన్‌కు శరీరం మరింత సున్నితంగా మారుతుంది. కాకరకాయను కూరగా లేదా రసం రూపంలో తీసుకోవటం మధుమేహ వ్యాధిగ్రస్తులు మరియు సాధారణ వ్యక్తుల రక్తంలోని చక్కెర స్థాయిలలో మార్పులు సంభవించవచ్చు.
 
పచ్చని ఆకుకూరలు తినటం వలన ఆరోగ్యానికి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. వీటితో పాటుగా మధుమేహం కూడా తగ్గించబడుతుందని కొన్ని పరిశోధనలలో వెళ్ళడయింది. ఈ పరిశోధనలలో పచ్చని ఆకుకూరలను తినటం వలన మధుమేహం బారి నుండి బయటపడవచ్చని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీజేపీ జాతీయ కొత్త అధ్యక్షుడు ఎవరు? 20న ఎంపిక

అబద్దాల కోరు పాకిస్థాన్... కాశ్మీర్ విషయంలో నోర్మూసుకుని కూర్చొంటే మంచింది...

హోటల్ గదిలో భార్యతో ఆమె ప్రియుడు, పట్టుకున్న భర్త, సరే విడాకులు తీసుకో అంటూ షాకిచ్చిన భార్య

Roja: పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన ఆర్కే రోజా... మాటలకు, చేతలకు సంబంధం లేదు

పురుషులు గర్భందాల్చుతారా? భారత సంతతి వైద్యురాలికి వింత అనుభవం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫిబ్రవరి 14న వివాహం చేసుకోబోతున్న ధనుష్, మృణాల్ ఠాకూర్?

Nabha Natesh: నాగబంధం నుంచి పార్వతిగా సాంప్రదాయ లుక్ లో నభా నటేష్

Sai Durga Tej: పంచె కట్టు ధరించిన సాయి దుర్గతేజ్.. సంబరాల ఏటిగట్టు లుక్

రణధీర్ భీసు-హెబ్బా పటేల్ జంటగా మిరాకిల్ సంక్రాంతి లుక్

పూరీ జగన్నాథ్ కొత్త చిత్రం పేరు 'స్లమ్ డాగ్'

తర్వాతి కథనం
Show comments