Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణులు మెుక్కజొన్న తింటే..?

Webdunia
శనివారం, 15 డిశెంబరు 2018 (10:45 IST)
మెుక్కజొన్న చలికాలంలో ఎక్కువగా దొరుకుతాయి. కార్న్ గింజల్ని గ్రేవీలో వేసి ఫ్రైడ్‌రైస్‌తో కలిపి తీసుకోవచ్చు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వంటి వాటితో కూడా చేర్చి సాయంకాలం వేళ స్నాక్స్‌గా కూడా తినొచ్చు. మొక్కజొన్న పొత్తులను సాధారణంగా నిప్పులపై వేడిచేసి బాగా కాలిన తర్వాత తింటారు. ఎలా తిన్నా మొక్కజొన్న రుచికి మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
 
మొక్క‌జొన్నలో ఫ్లేవ‌నాయిడ్స్ అని పిల‌వ‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి శ‌రీరంలో ఏర్ప‌డే ఫ్రీ ర్యాడిక‌ల్స్ ప్ర‌భావాన్ని త‌గ్గిస్తాయి. దీని కార‌ణంగా క్యాన్స‌ర్లు రావు. మెుక్కజొన్నలో బీటా కెరోటిన్‌, విట‌మిన్ ఎ, విట‌మిన్ సి ఉండ‌డం వ‌లనే మ‌న చ‌ర్మానికి సంర‌క్ష‌ణ క‌లుగిస్తుంది. చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. 
 
జింక్‌, పాస్పర‌స్‌, మెగ్నిషియం, ఐర‌న్‌లు, ఇత‌ర మిన‌రల్స్ మొక్క‌జొన్న‌లో ఉంటాయి. ఇవి ఎముక‌ల బ‌లానికి చాలా ఉపయోగపడుతాయి. ఎముక‌ల‌కు దృఢ‌త్వం క‌లుగుతుంది. కీళ‌్లనొప్పులతో బాధప‌డేవారు మొక్క‌జొన్న‌ల‌ను ఆహారంలో భాగం చేర్చుకుంటే అనారోగ్య సమస్యల నుండి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మొక్క‌జొన్న‌ల్లో ఐర‌న్ పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.
 
మొక్కజొన్నలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. అవి జీర్ణక్రియకు బాగా తోడ్పడతాయి. పేగు క్యాన్సర్‌ను కూడా నివారిస్తుంది. మొక్కజొన్న గింజలు చాలా బలవర్ధకమైన ఆహారం. దీంట్లో ఉండే లవణాలు, విటమిన్స్ ఇన్సులిన్‌పై ప్రభావం చూపిస్తాయి. మధుమేహం ఉన్నవారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఫోలిక్ యాసిడ్ పుష్క‌లంగా ఉండ‌డం వ‌లన మొక్క జొన్న గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది. వారి క‌డుపులోని బిడ్డ‌కు ఫోలిక్ యాసిడ్ ఎంతో అవ‌స‌రం. కాబ‌ట్టి మొక్క‌జొన్న‌ల‌ను గ‌ర్భిణీలు తింటే పుట్ట‌బోయే పిల్ల‌ల‌కు ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రావు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments