Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంట్రులకు రాలిపోతున్నాయా? సహజసిద్ద పద్ధతులతో చెక్ పెట్టండి!

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2016 (08:51 IST)
చాలా మందిలో వెంట్రుకలు రాలిపోతుంటాయి. మానసిక ఒత్తిడి, పౌష్టికాహార లోపం, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలో ఇలాంటి సమస్యలు అధికంగా ఉంటాయి. ఈ క్రమంలో హెయిర్‌లాస్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న వారు దాన్ని ఆపడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. వెంట్రులు రాలడానికి చిన్నపాటి సహజ సిద్ధమైన చిట్కాలు పాటిస్తే చాలు.. కొంతమేరకు ప్రయోజనం ఉంటుంది. 
 
కొబ్బరిపాలు, కొబ్బరి నూనె, ఆమ్లా ఆయిల్, నిమ్మరసం తదితరాలను కొద్ది కొద్దిగా తీసుకుని అన్నింటినీ బాగా కలిపి కుదుళ్లకు తగిలేలా జుట్టుకు పట్టించాలి. కొంత సేపటి తరువాత తలస్నానం చేయాలి. ఇది చుండ్రు సమస్యను తగ్గించడంతోపాటు జుట్టుకు సంరక్షణనిస్తుంది. కొద్దిగా దాల్చిన చెక్క పొడికి ఆలివ్ నూనె, తేనెలను కలిపి పేస్ట్‌లా తయారు చేసి జుట్టుకు పట్టించినా మంచి ఫలితం కనిపిస్తుంది. 
 
కలబంద, గోధుమ గడ్డి జ్యూస్‌లను తరచూ సేవించినా హెయిర్ ఫాల్‌ను అడ్డుకోవచ్చు. అలోవెరా జెల్‌ను జుట్టు కుదుళ్లకు పట్టించి తలస్నానం చేసినా వెంట్రుకలకు ఆరోగ్యం కలుగుతుంది. వారంలో ఇలా కనీసం రెండు సార్లు చేస్తే చక్కని ఫలితం ఉంటుంది. 
 
కొద్దిగా వేపాకులను తీసుకుని ముద్దగా నూరి జుట్టుకు బాగా పట్టించాలి. దీని వల్ల వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. అంతేకాదు కుదుళ్ల గట్టిపడి వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. అయితే ఈ వేపాకుల మిశ్రమానికి యాపిల్ సైడర్ వెనిగర్‌ను కలిపి వాడితే మరింత ఫలితం కనిపిస్తుంది. 
 
ధనియాల పొడితో చేసిన జ్యూస్ లేదా పెరుగు, శనగపిండిల మిశ్రమాన్ని తలస్నానం చేసేందుకు ఒక గంట ముందు జుట్టుకు బాగా పట్టించి అనంతరం స్నానం చేయాలి. దీంతో కూడా వెంట్రుకలు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రధాని మోదీ వల్లే ప్రపంచ వ్యాప్తంగా యోగాకు గుర్తింపు.. చంద్రబాబు కితాబు

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 28 మంది మృతి

భారతీయుల ఆగ్రహం: ఛీ.. ఛీ.. మీ దేశం ముఖం చూడం, టర్కీకి 11,000 కోట్లు నష్టం

Covid-19: దేశంలో పెరుగుతున్న కరోనా-యాక్టివ్‌గా 257 కేసులు-JN.1 Strain

లేడీ డాక్టర్‌ను పెళ్ళి పేరుతో నమ్మించి హోటల్‌కు పిలుపు... కోరిక తీర్చుకున్నాక పెళ్లికి నిరాకరణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

Show comments