Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండ్లను శుభ్రంగా కడిగి తినకపోతే..?

పండ్లను మార్కెట్ నుంచి తెచ్చుకుని.. పొడిదుస్తులతో తుడిచేసి కట్ చేసి లాగించేస్తున్నారా? అయితే ఇక జాగ్రత్తపడండి. యాపిల్స్‌, ద్రాక్ష, చెర్రీస్‌, టమాటా, దోసకాయ, మామిడి, స్ట్రాబెర్రీ, అరటి పండు ఇలా పలు రకా

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (10:58 IST)
పండ్లను మార్కెట్ నుంచి తెచ్చుకుని.. పొడిదుస్తులతో తుడిచేసి కట్ చేసి లాగించేస్తున్నారా? అయితే ఇక జాగ్రత్తపడండి. యాపిల్స్‌, ద్రాక్ష, చెర్రీస్‌, టమాటా, దోసకాయ, మామిడి, స్ట్రాబెర్రీ, అరటి పండు ఇలా పలు రకాల పండ్లు, కూరగాయలకు రంగు వచ్చేందుకు, పండేందుకు రసాయనాలు వాడుతున్నారు. వాటిని తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యత, నాడీ వ్యవస్థ దెబ్బతినడం, క్యాన్సర్‌ వంటి రోగాలకు దారితీస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇలా శుభ్రం చేయని పండ్లను తీసుకోవడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గుతుంది. పండ్లు, కూరగాయలు ఇంటికి తెచ్చినప్పుడు గోరువెచ్చని నీటిలో కొద్ది సేపు నానబెట్టిన తరువాత గుడ్డతో తుడిచేసిన తరువాత వాటిని తినాలి. ఏ కాలంలో దొరికే పండ్లను అప్పుడే తినాలి. 
 
యాపిల్‌లో ఎక్కువగా మెరుపు కన్పిస్తే మైనపు పూత ఉన్నట్లే. గోటితో పండుపై గీకితే అంటుకుంటుంది. ఒకవేళ ఇంటికి తెచ్చినట్లైతే చాకుతో పైన చెక్కినా చాలు. అనుమానం ఉంటే పండుపై వేడి నీళ్లు పోస్తే తెలిసిపోతుంది. మైనపు పూత పోవాలంటే పండును బాగా కడగాలి. చాకుతో తొక్కను మొత్తం తీసి వేసి అప్పుడే తినాలి. లేదంటే జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులకు మరింత ప్రమాదకరం. బాగా పండినవి, తొడిమ తొలగకుండా ఉన్న అరటి పండ్లను మాత్రమే కొనుగోలు చేయాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం
Show comments