Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలసట రాకుండా ఉండాలంటే... ఈ టిప్స్ పాటించండి!

Webdunia
శుక్రవారం, 4 జులై 2014 (16:35 IST)
ఎంతో బిజీగా ఉండి, ఎన్ని పనులు ఉన్నప్పటికీ కొందరు చాలా చురుకుగా కనిపిస్తారు. దీనికి కారణం సమయపాలన, అధికశక్తి. మరి కొందరు ఎక్కువ పని చేయకపోయినా అలసినట్లు కన్పిస్తారు. వీరికి అధికశక్తి లేకపోవడమే ప్రథమ కారణమని వైద్యులు సూచిస్తున్నారు. ఒకే వయసు గలవారిలో కొందరికి శక్తి అధికంగా ఉండటం మరికొందరికి శక్తి లోపించడానికి వంశపారంపర్యం, హార్మోన్ల సమతుల్యత శరీరంలో కండరాల్లో ఉండే కొవ్వు, తీవ్రత, వాడే మందులు వంటి అనేక కారణాలు చెప్పుకోవచ్చు. 
 
అలసటకు దూరంగా ఉండేందుకు మీ కోసం కొన్ని చిట్కాలు... జీర్ణక్రియ సరిగా లేకపోవడం అలసటకు ప్రథమ కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. ఆహారం బాగా జీర్ణమయి ఒంటికి పడితే మంచి శక్తి వస్తుందని వారు సూచిస్తున్నారు. కాబట్టి జీర్ణక్రియను మెరుగుపరుచుకునేందుకు కావలసినంత నీటిని సేవించండి. 
 
ఆకుకూరలు ప్రతిరోజు ఒకపూటకు వాడండి. నిద్రించేందుకు ముందుగా గ్లాసుడు పాలు ఓ అరటి పండును తిని పడుకుంటే జీర్ణక్రియకు సంబంధించిన వ్యాధులు దరిచేరవు. ఆకుకూరలను సూప్ విధానంలో తీసుకుంటే జీర్ణక్రియ సులభంగా ఉంటుంది. కొత్తిమీర, అల్లం, జీలకర్రలను వంటల్లో అధికంగా చేర్చండి. సమయానికి తినడం చేస్తే జీర్ణ ప్రక్రియ సులభమై శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. కొవ్వుతో కూడిన ఆహారపదార్థాలను తినడం మానేస్తే మంచిది.
 
ఆల్కహాల్ సేవనాన్ని తగ్గించడం ద్వారా కాలేయానికి సంబంధించిన వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. జంక్‌ఫుడ్‌ను అధికంగా తీసుకోవడం మంచిది కాదని వైద్యుల సలహా. ఈ జంక్‌ ఫుడ్ తీసుకోవడం ద్వారా యాంటీబయాటిక్‌లు వాడిన తర్వాత ప్రొబయాటిక్ చికిత్స చేసుకోవడం మంచిదని వారు సూచిస్తున్నారు. అలసటకు దూరంగా ఉండాలంటే ఆహారంలో సమయపాలన, పండ్లరసాలు, ఆకుకూరలను తగిన మోతాదులో తీసుకోవడం ద్వారా తగ్గించవచ్చునని వైద్యులు పేర్కొంటున్నారు.  
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైద‌రాబాద్‌లో నేష‌న‌ల్ హెచ్ఆర్‌డీ నెట్‌వ‌ర్క్ అత్యాధునిక కార్యాల‌యం

ఆ ఐదు పులులు ఎందుకు చనిపోయాయంటే...

ఎయిరిండియా విమాన ప్రమాదం - దర్యాప్తు అధికారికి ఎక్స్ కేటగిరీకి భద్రత

మహా న్యూస్ చానెల్‌‍పై దాడిని తీవ్రంగా ఖండించిన పవన్ కళ్యాణ్

కాంగ్రెస్ నేతలంటే అపార గౌరవం... సీరియస్‌గా తీసుకోవద్దు : కొండా మురళి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

Pawan: పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు ట్రైలర్ కు డేట్ ఫిక్స్

అలాంటి తల్లిదండ్రులకి ఒక గుణపాఠం కావాలి : హీరో శివాజీ

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

Show comments