Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర చెంచాడు గంధం పేస్ట్‌ను నీళ్లలో కలిపి తీసుకుంటే...

Webdunia
గురువారం, 1 ఆగస్టు 2019 (22:05 IST)
గంధాన్ని ఒక సుగంధ ద్రవ్యంగా వినియోగిస్తుంటారు. దీనిని స్త్రీ పురుషులు తేడా లేకుండా శరీరంపై లేపనంగా, పసుపు కలిపి తిలకంగా, బొట్టుగా పెట్టుకుంటారు. కొన్ని గుళ్లలో వీటిని తప్పకుండా దేవుడికి రాస్తుంటారు. ఏది ఎలా ఉన్నా గంధంలోని సుగంధతైలాలు - ఔషధ తత్వాలు, అరుదుగా దొరకడం వల్ల ఖరీదైన సుగంధ ద్రవ్యంగా పూర్వం పరిగణిస్తున్నారు. 
 
ఆయుర్వేదంలో గంధాన్ని చందనం అని కూడా పిలుస్తారు. ఇది ఎర్రచందనం, తెల్లచందనం అని రెండు రూపాల్లో ఉంటుంది. వీటిని ఎర్రచందనం అనే దానిని పరికరాలు, బొమ్మల తయారీకి వాడుతుంటారు. దీని నుంచి నూనెను సేకరిస్తారు. తెల్లచందనంతో సుగంధ ద్రవ్యాలు, ఔషధాల తయారికీ సెంట్ల తయారీకీ, సబ్బుల తయారీకీ వాడుతుంటారు. ఎర్రచందనం నూనెను చందనాన్ని ఔషధాల తయారీకి వాడుతుంటారు. ఆయుర్వేద మందుల్లోనూ ఇస్తుంటారు. మనం వాడే విధానాన్నిబట్టి తైలాలు పనిచేస్తుంటాయి. దీనిని శ్రీ గంధం అని కూడా అంటారు.
 
గంధాన్ని నలుగులో కలిపి రుద్దుకుంటే చర్మం మృదువుగా దుర్గంధ రహితంగా ఉంటుంది.
 
గంధం నుంచి తీసిన నూనెను, నీళ్లలో 5-6 చుక్కలు వేసి స్నానం చేస్తే శరీర బడలిక తగ్గుతుంది.
 
గంధం తైలాన్ని నూనెలో కలిపి వత్తిగా చేసి దీపం పెట్టినా, దీనితో చేసిన అగరు వత్తి వెలిగించినా మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
 
గంధం అరగదీసి అర చెంచాడు పేస్ట్‌ను నీళ్లలో కలిపి తీసుకుంటే మూత్రంలో మంట, శరీరంలో ఆవిర్లు, మంటలు, పిత్త వికారాలు తగ్గుతాయి. గంధపు నూనెను ఇతర తైలాలతో కలిపి వాడుకోవాలి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments