Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండుద్రాక్షతో మలబద్దకం నివారణ...

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (09:47 IST)
మనం నిత్యం తీసుకునే ఆహారం వలన మన ఆరోగ్యసమస్యలను మనం ఎదుర్కోలేక పోతున్నాము. మనం కొంత అదనపు ఆహారం తీసుకోవడం మంచిది. డ్రైపూట్స్‌లో మన ఆరోగ్యానికి కావలసిన పోషకాహారం పుష్కలంగా ఉంటాయి. ఇవి చూడటానికి చిన్నవిగా ఉన్నా వాటిలో వుండే క్యాలిరీల శక్తి అధికం ఉంటుంది. ఎండిన పండ్లలో మనకు తెలిసినది ఎండుద్రాక్ష.
 
1. ఎండు ద్రాక్షలో ఒలెనిక్ అయాసిడ్ ఉన్నందున దంతాలలో ఉన్న బ్యాక్టీరియాను పెరగనివ్వకుండా పళ్ళను రక్షిస్తుంది. అంతేకాదు దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున విరేచనం సాఫీగా జరుగుతుంది. రోజు మలబద్దకంతో బాధపడేవారు రాత్రిపూట పడుకునేముందు ఎండుద్రాక్షతో పాటు, సోంపును కలిపి తీసుకుంటే మలబద్దకం నుంచి ఉపశమనం కలుగుతుంది.
 
2. స్త్రీలలో అధిక శాతం రక్తహీనత కలిగి ఉంటారు. అందువలన స్త్రీలు ఎండుద్రాక్ష తీసుకోవడం వలన ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ అందుతాయి. దీని వలన బ్లడ్ కౌంట్ త్వరగా పెరిగే అవకాశం ఉంది. ఇనుము అధికంగా ఉండడం వలన రక్తంలోకి త్వరగా చేరుతుంది.
 
3. ఎండుద్రాక్షలో ఉండే పోలిఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో కోలన్ క్యాన్సర్ కారణం అయ్యే టోమర్ సెల్స్‌తో పోరాడే గుణాలు దీనిలో ఎక్కువగా ఉండడం వలన క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.
 
4. దీనిలో గ్లూకోజ్, విటమిన్ల యొక్క శోషణ ప్రోత్సహించే ఫ్రక్టోజ్‌ను కలిగి వుంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎసిడిటిని తగ్గించే పొటాషియం మరియు మెగ్నీషియం కూడా దీనిలో అధికంగా ఉంటుంది. ఈ పండ్లను తరుచుగా తినడం వలన శరీరంలో పులుపును స్వీకరంచే శక్తిగల ఆమ్లాలను సమానం చేసి జ్వరము రాకుండా చేస్తుంది.
 
5. ఎండుద్రాక్ష తినడం వలన శరీరంలో రక్త కణాలు, హిమోగ్లోబిన్‌ల శాతం పెరగేలా చేస్తాయి. మెదడు, గుండె, నరాలు, ఎముకలు, కాలేయం చక్కగా పనిచేసేలా చేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

Andhra liquor scam: ఛార్జిషీట్‌లో జగన్ పేరు ఉన్నా.. నిందితుడిగా పేర్కొనలేదు..

నువ్వుచ్చిన జ్యూస్ తాగలేదు.. అందుకే సాంబారులో విషం కలిపి చంపేశా...

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

ఎన్నో అడ్డంకులు అధిగమించి రాబోతున్న హరిహర వీరమల్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా?

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

తర్వాతి కథనం
Show comments