Webdunia - Bharat's app for daily news and videos

Install App

బరువు తగ్గాలంటే.. ఆకలి లేనప్పుడు తినకండి. టీవీలకు అతుక్కుపోకండి..

ఆకలిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోండి. ఆకలి లేనప్పుడు అస్సలు ఆహారం తీసుకోవద్దు. ప్యాకేజ్ ఫుడ్‌ అంటే ఫాస్ట్ ఫుడ్‌ను తీసుకోకండి. వీలైనంతమేరకు వీటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. లిఫ్ట్‌లో పై ఫ్లోర్‌లోకి

Webdunia
బుధవారం, 2 నవంబరు 2016 (11:30 IST)
బరువు తగ్గాలంటే.. ? ప్రతి రోజూ ఎనిమిది గ్లాసుల నీటిని సేవించండి. టీ, కాఫీ, జ్యూస్‌లలో చక్కెర శాతాన్ని తగ్గించుకోండి. కాబట్టి ప్రతి రోజూ క్రమం తప్పకుండా నీరు సేవించాలి. చిన్న కప్పుల్లో (ఐదు నుంచి ఆరుసార్లు) అన్నం తీసుకోండి లేదా స్నాక్స్ తీసుకోండని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ప్రతి రోజు నడకను అలవాటు చేసుకోండి. ఇంటి బయట, షాపింగ్‌కు వెళ్ళాలన్నా నడిచే వెళ్ళండి. రోజుకు కనీసం 45 నిమిషాలు నడవండి. దీంతో మీ శరీరంలోని క్యాలరీలు ఖర్చౌతాయి. వీలైనంత ఎక్కువగా సలాడ్‌లు తీసుకోండి. అలాగే మీ ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలుండేలా చూసుకోండి. సొరకాయ, టమోటాలు ఆహారంగా తీసుకోవాలి. 
 
ఆకలిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోండి. ఆకలి లేనప్పుడు అస్సలు ఆహారం తీసుకోవద్దు. ప్యాకేజ్ ఫుడ్‌ అంటే ఫాస్ట్ ఫుడ్‌ను తీసుకోకండి. వీలైనంతమేరకు వీటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.  లిఫ్ట్‌లో పై ఫ్లోర్‌లోకి వెళ్ళేటట్లైతే లిఫ్ట్‌ను ఉపయోగించకుండా మెట్ల దారిలో నడిచి వెళ్ళండి. మీ ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు ఆరోగ్యనిపుణులు. మీకు పండ్ల రసం తాగాలనిపిస్తే పండ్ల రసంకన్నా పండ్లను సేవించండి. పండ్ల రసం తాగేకన్నా పండ్లు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచింది. 
 
ప్రకృతి పరంగా లభించే కూరగాయలన్నీ సమయానుసారం ఆహారంలో ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా రాత్రిపూట కేవలం కూరగాయలతో చేసిన సలాడ్ మరియు మొలకెత్తిన గింజలుండేలా చూసుకోండి. అందులోకూడా ఎక్కువగా తినకండి. తగినంత మాత్రమే ఆహారంగా తీసుకోవాలంటున్నారు వైద్యులు. 
 
మీ కార్యాలయంలో నిత్యం కూర్చొని పని చేసేవారైతే ప్రతి రెండు గంటలకొకసారి కార్యాలయమంతా కలియ తిరగండి. అలాగే ఇంట్లో కూడా కనీసం ఐదు నిమిషాలపాటు నడవండి. దీంతో మీ శరీరం తెలికగా మారుతుంది.  ప్రతి రెండు గంటలకొకసారి ఓ ఐదు నిమిషాలపాటు బ్రిస్క్ వాక్ చేయండి. తదేకంగా గంటలకొద్ది టీవీని చూడొద్దని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

Jagitial: రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ మృతి.. బైకర్ కూడా..?

ఈ శ్వేతవర్ణపు జింకను చూస్తే అదృష్టమేనట! (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

'హరి హర వీరమల్లు'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : నిర్మాత ఏ.ఎం.రత్నం

బోరున విలపించిన జానీ మాస్టర్... ఎందుకో తెలుసా? (Video)

రాజ్ తరుణ్-లావణ్య కేసు- హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు

తర్వాతి కథనం
Show comments