Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో పిక్క పట్టింది.. ఏం చేయాలి?

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (22:54 IST)
నిద్ర పోతూ వుంటాం. అకస్మాత్తుగా కొందరిలో కాలి కండరాలు పట్టేస్తాయి. పిక్క పట్టేస్తుందని అంటుంటారు. ఈ పిక్క పట్టిందని ప్రాణం లేచిపోయినట్లనిపిస్తుంది. కాలి కండరాలు ఇలా పట్టేసినప్పుడు ఈ క్రింది విధంగా చేస్తే ఉపశమనం లభిస్తుంది.
 
1. త‌గినంత‌ పొటాషియం మన శరీరంలో లేక‌పోయినప్పుడు ఇలా జ‌రుగుతుంది. కనుక పొటాషియం ఎక్కువ‌గా ఉండే అర‌టిపండ్లు త‌దిత‌ర ఆహారాల‌ను తీసుకుంటే ఈ సమస్య రాకుండా వుంటుంది.
 
2. తొడ కండ‌రాలు, కాలి పిక్క‌లు ప‌ట్టేసిన‌ప్పుడు ఆ ప్ర‌దేశంలో ఐస్ గ‌డ్డ‌లు క‌లిగిన ప్యాక్‌ను పెట్టుకోవాలి. అలా నొప్పి త‌గ్గేంత వ‌ర‌కు చేస్తే స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
 
3. మరో చిట్కా ఏంటంటే... కొబ్బ‌రినూనె, ఆలివ్ ఆయిల్‌, ఆవ నూనెల‌ను స‌మ‌భాగాల్లో తీసుకుని మిశ్ర‌మంగా చేసి దాన్ని వేడి చేసి ఆ మిశ్ర‌మాన్ని స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో రాస్తూ సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. దీంతో కండరాల నొప్పి తగ్గుతుంది.
 
4. ఇంకా... కొబ్బ‌రినూనె కొద్దిగా తీసుకుని దాంట్లో కొన్ని లవంగాలు వేసి ఆ మిశ్ర‌మాన్ని వేడి చేయాలి. దీన్ని గోరువెచ్చ‌గా ఉన్న‌ప్పుడు స‌మ‌స్య ఉన్న ప్రాంతంలో రాస్తే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments