Webdunia - Bharat's app for daily news and videos

Install App

కండరాలకు శక్తి కావాలంటే..

Webdunia
గురువారం, 27 ఏప్రియల్ 2023 (17:02 IST)
మానవ శరీరంలో కండరాలు చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఈ కండరాలకు బలం చేకూర్చటానికి పౌష్టికాహార నిపుణులు కొన్ని రకాల ఆహార పదార్థాలను సూచిస్తున్నారు. అవేమిటో చూద్దాం. 
 
చికెన్ : కండరాలు దృఢపడాలంటే ప్రొటీన్ ఉండాలి. ఆదేసమయంలో కొవ్వు ఎక్కువగా ఉండకూడదు. చికెన్‌లో ఈ రెండు లక్షణాలు ఉన్నాయి. మిగిలిన మాంసాలతో పోలిస్తే చికెన్‌లోనే ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది.
 
తోపు : మాంసాహారం తిననివారికి ప్రొటీన్ కావాలంటే తోపును తినమని నిపుణులు సూచిస్తున్నారు. మిగిలిన పదార్థాలన్నింటి కన్నా తోపులో ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది. వారంలో కనీసం మూడుసార్లు 150 గ్రాముల చొప్పున తోపును తింటే అనేక ప్రయోజనాలుంటాయని పేర్కొంటున్నారు.
 
వేరుశనగ : వేరుశనగలో ప్రొటీన్లు ఎక్కువ ఉంటాయి. అందువల్ల వేరుశనగతో చేసిన పదార్థాలు తింటే కండరాలకు అదనపు శక్తి లభిస్తుంది. అందువల్ల ఆహారంలో వేరుశనగను తప్పనిసరిగా చేర్చమని పౌష్టికాహార నిపుణులు సూచిస్తున్నారు.
 
కోడిగుడ్డు : వీటిలో బి-విటమిన్ ఉండటం వల్ల తక్షణ శక్తి వస్తుంది. దీంతోపాటు ఒక ఉడికిన కోడిగుడ్డులో 6 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అమినో యాసిడ్ గుణం వల్ల కండరాల వృద్ధి కలుగుతుంది. వీటితో పాటు తాజా కూరగాయలు, పండ్లు, ఓట్స్, గింజలు.. లాంటివి తినటం వల్ల కూడా మజిల్ ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. 
 
గేదె పాలు : గేదె పాలల్లో ప్రొటీన్ల శాతం ఎక్కువ. కండరాల మెరుగుతోపాటు ఇందులోని కాల్షియం వల్ల ఎముకలకూ మంచిది. పిండిపదార్థం, థయామిన్ అధికంగా ఉండే బ్రౌన్ రైస్ తినటం వల్ల. కూడా కండరాలకు ఎంతో ఉపయోగం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

తర్వాతి కథనం
Show comments