Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడుము నొప్పి... వదిలించుకునే మార్గాలివే....

ఎక్కువసేపు కదలకుండా కూర్చుని పని చేయడం వల్ల వెన్నెముకపై నలభై శాతం భారం పడుతుంది. నిటారుగా కూర్చోకపోవడం, వంగిపోయి పనిచేయడం సమస్యను ఇంకా పెంచుతాయి. దీన్ని అధిగమించాలంటే వీపు నుంచి నడుము భాగం వరకూ కుర్చీకి ఆనుకుని కూర్చోవాలి. తలను వీలైనంత వరకూ నిటారుగ

Webdunia
శుక్రవారం, 1 జులై 2016 (17:18 IST)
ఎక్కువసేపు కదలకుండా కూర్చుని పని చేయడం వల్ల వెన్నెముకపై నలభై శాతం భారం పడుతుంది. నిటారుగా కూర్చోకపోవడం, వంగిపోయి పనిచేయడం సమస్యను ఇంకా పెంచుతాయి. దీన్ని అధిగమించాలంటే వీపు నుంచి నడుము భాగం వరకూ కుర్చీకి ఆనుకుని కూర్చోవాలి. తలను వీలైనంత వరకూ నిటారుగా ఉంచాలి తప్ప ముందుకీ, పక్కకీ వంచకూడదు.
 
* గుండె, మధుమేహం, అధికబరువును అదుపులో ఉంచేందుకు తీసుకునే ఆహారం నడుము నొప్పిని తగ్గిస్తుంది. కాబట్టి ఆహారాన్ని నిర్లక్ష్యం చేసేవారు కొన్ని మార్పులు చేసుకోవాలి. కెఫీన్, ప్రాసెస్ చేసిన పదార్థాలు తగ్గించాలి. పొట్టు ధాన్యాలూ, సోయా, నట్స్, గింజలూ, కూరగాయలూ, పండ్లూ ఎక్కువగా తీసుకోవాలి.
 
* అసలు వ్యాయామం చేయకపోవడం కూడా నడుమునొప్పికి కారణమం అవుతుంది. నడుమునొప్పి ఉన్న‌ వారిలో నలభైశాతం చురుకుదనం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. న‌డుమునొప్పి బారిన పడకుండా ఉండాలంటే తరచూ నడవాలి. దానివల్ల బిగుసుకుపోయినట్లుగా ఉన్న శరీరం సౌకర్యంగా మారుతుంది. అలాగే నడుము నొప్పిని తగ్గించుకోవడానికి అత్యంత సులువైన పరిష్కారం యోగా అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కి చెందిన అధ్యయనకర్తలు.
 
* ఏళ్ల తరబడి ఒకే పరుపును వాడటం కూడా నడుమునొప్పికి కారణం అవుతుంది. సాధారణంగా నాణ్యమైన పరుపులు కూడా పదేళ్లకు మించి వాడకూడదు. అయితే దానిపై పడుకున్నప్పుడు నడుము పట్టేసినట్లు ఉంటే.. ఏడేళ్ల తరవాత మార్చేయడం మంచిది. పరుపు మరీ మెత్తగా అలాగని గట్టిగా లేకుండా చూసుకోవాలి. మరీ గట్టిగా ఉన్నవి అయితే నడుముపై భారం పడుతుంది.
 
* చాలా సందర్భాల్లో వస్తువులన్నీ పట్టే హ్యాండుబ్యాగుని ఎంచుకుంటాం. అది మనకు సౌకర్యాన్నిచ్చినా బరువున్న బ్యాగును వేసుకోవడం వల్ల భుజాలు వంగిపోతాయి. అదే సమయంలో నడుముపైనా భారం పడి నడుమునొప్పి వ‌స్తుంది. కాబట్టి వీలైనంత వరకూ తక్కువ బరువున్న బ్యాగును ఎంచుకోవాలి. బ్యాగును ఒకే భుజానికి గంటల తరబడి వేసుకోకుండా తరచూ మారుస్తుండాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

తర్వాతి కథనం
Show comments