Webdunia - Bharat's app for daily news and videos

Install App

శీతాకాలంలో పెదవుల సంరక్షణకు....

శీతాకాలంలో వచ్చిందంటే చాలు పెదవులు పగిలిపోతాయి. పొరపొరలుగా చర్మం రాలిపోతుంది. ఆ పొరలు తీస్తే మంటగా, ఒక్కోసారి రక్తం కూడా వచ్చేస్తుంది. ఈ సమయంలో చాలామంది పెదవులను పదేపదే నాలుకతో తడుపుకోవడం చేస్తుంటారు. ఐతే అలా తడపడం వల్లే పెదవులు పొడిబారి మరింతగా ఎండి

Webdunia
బుధవారం, 28 డిశెంబరు 2016 (16:58 IST)
శీతాకాలంలో వచ్చిందంటే చాలు పెదవులు పగిలిపోతాయి. పొరపొరలుగా చర్మం రాలిపోతుంది. ఆ పొరలు తీస్తే మంటగా, ఒక్కోసారి రక్తం కూడా వచ్చేస్తుంది. ఈ సమయంలో చాలామంది పెదవులను పదేపదే నాలుకతో తడుపుకోవడం చేస్తుంటారు. ఐతే అలా తడపడం వల్లే పెదవులు పొడిబారి మరింతగా ఎండిపోతాయి. అలాగే పెదవులపై ఎండిపోయిన పొరలను తీసే ప్రయత్నం కూడా కొందరు చేస్తుంటారు. అలా తీయడం వల్ల రక్తం వచ్చి చిన్నచిన్న గాయాలుగా మారతాయి. 
 
ఈ సమస్యకు విటమిన్ ఇ, ఎ-లను కలిగిన లిప్ బామ్‌ను వాడితే మంచిది. ఇవి పెదవులకు కావాల్సిన తేమను అందిస్తాయి. చలికాలంలో దాహం తక్కువగా వేస్తుంది. కావున చాలామంది నీళ్లు తక్కవుగా తాగుతారు. అలాకాకుండా రోజూ ఎనిమిది గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగాలి. దీనివల్ల పెదవులకు కూడా కావాల్సినంత తేమ, శరీరం నుంచి అందుతుంది. రాత్రి, ఉదయం ముఖం కడగడానికి ముందు లేదా పడుకోవడానికి ముందు పెదాలకు కొబ్బరి నూనె లేదా వెన్నపూస వంటివి రాసి సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఆలొవెరా ముక్కతో పెదాలు తరుచుగా రుద్దితే గాయాలు మానిపోతాయి. అలోవేరాలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది పెదాలకి తేమని అందిస్తుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments