Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెరుకు రసం తాగితే శరీరానికి మంచిదా? కాదా?

వేసవి కాలం వచ్చేసింది. మన దాహాన్ని తీర్చకోవడానికి ఫ్రిజ్‌లో కూల్ డ్రింక్స్, మంచినీరు ఎక్కువగా వాడుతుంటాము. చల్లనివి తాగేటప్పుడు బాగానే ఉంటాయి కానీ మన ఆరోగ్యానికి చాలా నష్టం చేకూరుస్తాయి. వేసవిలో విరివ

Webdunia
మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (19:10 IST)
వేసవి కాలం వచ్చేసింది. మన దాహాన్ని తీర్చకోవడానికి ఫ్రిజ్‌లో కూల్ డ్రింక్స్, మంచినీరు ఎక్కువగా వాడుతుంటాము. చల్లనివి తాగేటప్పుడు బాగానే ఉంటాయి కానీ మన ఆరోగ్యానికి చాలా నష్టం చేకూరుస్తాయి. వేసవిలో విరివిగా దొరికే చెరుకురసంతో దాహం తీరడమే కాదు శరీరానికి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. శక్తినిచ్చే ఈ వేసవి పానీయానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో చూద్దాం.
 
1. చెరుకు రసం స్పోర్ట్స్ డ్రింక్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఆటల వల్ల వచ్చే అలసటను దూరం చేసే మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ కాల్షియం చెరుకు రసంలో ఉంటాయి.
 
2. చెరుకు రసంలో సుక్రోజ్ రూపంలో ఉండే చక్కెరను శరీరం తేలికగా జీర్ణం చేసుకుంటుంది. కాబట్టి చెరుకు రసం తాగగానే తక్షణ శక్తి చేకూరుతుంది. డీహైడ్రేషన్ బారిన పడ్డప్పుడు చెరుకు రసం తాగితే త్వరగా కోలుకుంటారు.
 
3. చెరుకు రసంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాల తక్కువ. కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా చెరుకు రసం తాగొచ్చు. దీనిలోని సుక్రోజ్ దంత క్షయాన్ని కూడా నివారిస్తుంది.
 
4. క్యాన్సర్ రాకుండా నియంత్రించే ప్లేవనాయిడ్స్ చెరుకు రసంలో ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలు విస్తరించకుండా చేయడంతో పాటు వాటితో పోరాడి నాశనం చేస్తాయి. చెరుకు రసంలోని ఫ్లేవనాల్ ఒంట్లోని ఫ్రీ ర్యాడికల్స్‌ని పారదోలి కాలేయ వ్యాధులు, కామెర్ల నుంచి కాలేయానికి రక్షణ కల్పిస్తాయి.

సబ్జా గింజల్లో వుండే ఆరోగ్య రహస్యాలేమిటో వీడియోలో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియుడితో ప్రేమకు నిరాకరించిన తల్లిదండ్రులు.. మనస్తాపంతో..

గెస్ట్ హౌసుల్లో అమ్మాయిలతో కొండా మురళి ఎంజాయ్ : ఆర్ఎస్ ప్రవీణ్ (Video)

ఇదేం రిపోర్టింగ్ బ్రో, ఫెంగల్ తుపాను గాలుల్లో గొడుగు ఎగిరిపోతున్నా మైక్ పట్టుకుని...(Video)

పెళ్లయ్యాక మీరు చేసేది అదే కదా: విద్యార్థినిలపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులు

ఫెంజల్ తుపాను: కడపలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, తిరుపతి నుంచి వెళ్లాల్సిన 4 విమానాలు రద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

ఆడ పిల్లలు ఎదిగేందుకు తోడ్పాడు అందించాలి : నారి గ్లింప్స్ రిలీజ్ చేసిన మంత్రి సీతక్క

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

తర్వాతి కథనం
Show comments