Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫుడ్ పాయిజన్‌‌‌ అయినప్పుడు ఈ చిట్కాలను పాటిస్తే...

జీవన పోరాటంలో ప్రతి వ్యక్తీ కాలంతోపాటు పరుగెడుతున్నాడు. దీంతో కనీసం ప్రశాంతంగా కూర్చొని భోజనం చేసే సమయం కూడా లేకుండా పోతోంది. అందువలన కంటికి కనిపించిన హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్, రెస్టారెంట్లని ఇలా

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (09:57 IST)
జీవన పోరాటంలో ప్రతి వ్యక్తీ కాలంతోపాటు పరుగెడుతున్నాడు. దీంతో కనీసం ప్రశాంతంగా కూర్చొని భోజనం చేసే సమయం కూడా లేకుండా పోతోంది. అందువలన కంటికి కనిపించిన హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్, రెస్టారెంట్లని ఇలా ఎక్కడపడితే అక్కడ ఏది దొరికితే అది ఆరగిస్తూ ఆకలి బాధను తీర్చుకుంటున్నారు.
 
ఇలా చేయడం వలన చాలా మంది ఫుడ్ పాయిజనింగ్ బారినపడుతుంటారు. ఇలా జరిగినప్పుడు వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. కాబట్టి వీటినన్నింటి నుండి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలను తెలుసుకుంటే తప్పించుకోవచ్చును. 
 
కడుపులో వికారంగా అనిపించినపుడు కొంచెం జీలకర్ర నోట్లో వేసుకుని నమిలి ఆ రసాన్ని మింగితే మంచి ఫలితం లభిస్తుంది. ఒక గ్లాసు నీళ్లలో స్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించాలి. ఆ నీటిలో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి కడుపులో మంటకి మంచిది. పొట్టలో వికారంగా అనిపిస్తునప్పుడు రోజు స్పూన్ తేనెను తీసుకుంటే ఫుడ్ పాయిజన్ నుండి తప్పించుకోవచ్చును.
 
ఫుడ్ పాయజన్ వలన శరీరంలోని పొటాషియం పరిమాణం తగ్గిపోతుంది. అప్పుడు మీరు నీరసంగా కనిపిస్తారు. అలాంటప్పుడు వెంటనే ఒక అరటిపండు తింటే మంచిది. అలాకాకుంటే రెండు అరటి పండ్లను పెస్ట్‌లాచేసుకుని పాలలో కలిపి తీసుకున్నా కూడా ప్రయోజనం ఉంటుంది. పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటుంది. అందుచేత ఫుడ్ పాయిజన్ అయిన వ్యక్తి కప్పు పెరుగు తీసుకుంటే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments