Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమలపాకులు, నాలుగు మిరియాలు వేసి అలా చేసి తాగితే...

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (21:56 IST)
శీతాకాలం వచ్చిందంటే ఎటు చూసినా మంచుదుప్పటి పరుచుకుని వుంటుంది. దానితో పాటే సీజనల్ వ్యాధులు కూడా తరుముకుంటూ వస్తాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు వచ్చేస్తాయి. ఈ కరోనా కాలంలో నాలుగు తుమ్ములు తుమ్మినా భయపడిపోవాల్సిన పరిస్థితి వచ్చేస్తోంది. ఐతే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం వుంది కనుక వాటిని అడ్డుకునేందుకు ఇంటి చిట్కాలను పాటించాలి.

 
దగ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతున్నప్పుడు ప్రతిరోజూ ఉదయం మూడు కప్పుల నీళ్లలో రెండు తమలపాకులు, నాలుగు మిరియాలు వేసి సగం అయ్యేవరకు నీటిని మరిగించి అందులో ఒక టీస్పూన్ తేనె కలుపుకుని తాగాలి. దగ్గు నుండి ఉపశమనం పొందడానికి తులసి ఆకులను తేనెతో కలిపి పరగడుపున తీసుకోవాలి. దానిమ్మ తొక్కలను పొడి చేసి ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ కలిపి తీసుకుంటే రక్త శుద్ది జరుగుతుంది. 

 
వెన్నునొప్పితో బాధపడేవారు నువ్వుల నూనె లేదా ఆముదంలో వెల్లుల్లి రెబ్బలు వేసి ఐదు నిమిషాల పాటు సన్నని మంటపై మరిగించాలి. ఈ నూనెతో వెన్నుకు మర్దనా చేయాలి. అలాగే వెన్ను నొప్పి ఉన్నచోట అల్లం పేస్టుతో మర్దనా చేసినా నొప్పి తగ్గుతుంది. ఏదైనా గాయాలు తగిలి రక్తం కారుతుంటే చందనం పొడిలో కొద్దిగా నీటిని కలిపి పేస్టులా చేసుకుని గాయానికి రాయాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Ranganna: వైఎస్ వివేకానంద రెడ్డి కేసు.. రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ నోటీసులు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌: ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోల మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

పాతికేళ్ల స్వాతిముత్యం సారధ్యంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులకు సాదర సత్కారం

Nagabushnam: నేను కామెడీని హీరోయిజం చేస్తే, ఆయ‌న విల‌నిజంలోనూ కామెడీ చేశారు : డాక్ట‌ర్ రాజేంద్ర‌ప్ర‌సాద్

రానా దగ్గుబాటి నిర్మాణంలో రూపొందిస్తున్న కాంత లో సముద్రఖని లుక్

తర్వాతి కథనం
Show comments