Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంతాలపై పచ్చని గార పోవట్లేదా... అయితే ఇలా చేయండి...

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (11:47 IST)
అందమైన ముఖానికి చక్కని చిరునవ్వు ఓ ఆభరణం వంటింది. అయితే, మనసారా నవ్వాలంటే పలువరుస బాగుండాలి. ఆ పళ్ళు పచ్చగా ఉంటే హాయిగా నవ్వలేరు కూడా. పైగా, ఆ పచ్చని గార ఎంత దాచుకుందామన్నా దాగనిది. అలాంటిగారను పోగొట్టేందుకు చాలామంది రెండు పూటలా బ్రష్ చేస్తుంటారు. అయినప్పటికీ పచ్చని గార దంతాలను వదిలిపోదు. 
 
అయితే, అంగట్లో దొరికే టూత్‌ పేస్టుల కంటే ఇంట్లో దొరికే పదార్థాలతోనే ఈ సమస్యకు ఓ చక్కని పరిష్కారం కనుకొనవచ్చు. ఆ రెండు పదార్థాల్లో ఒకటి బేకింగ్ సోడా. రెండోది నిమ్మరసం. 
 
ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఓ స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. దానికి సగం చెక్క నిమ్మరసం పిండాలి. ఈ రెంటిని బాగా కలపాలి. వేలితో కొద్ది కొద్దిగా తీసుకుంటూ దంతాలపై రుద్దాలి. ఓ మూడు నిమిషాలు బ్రష్ చేసినట్టుగా వేలితో రుద్దాలి. తర్వాత నోటిలో నీళ్లు పోసుకుని బాగా పుక్కిలించాలి. అంతే.. మీ పచ్చని దంతాలు తెల్లగా మెరిసిపోవడం ఖాయం. 
 
గుప్పెడు తులసి ఆకులను తీసుకుని నీడలో ఆరబెట్టాలి. ఆరిన తర్వాత వాటిని మెత్తగా పొడిచేసుకోవాలి. ఈ పొడితో పళ్లు రుద్దుకుంటే కూడా పచ్చని దంతాలు తెల్లగా మారే అవకాశం ఉంది. రోజూ వాడే పేస్టుకి ఈ తులసి పౌడర్ జత చేసినా మంచిదే. ఇతర సమస్యలకు కూడా తులసి పౌడర్ అద్భుతంగా పనిచేస్తుంది.
 
ఉప్పులో కొన్ని చుక్కలు నిమ్మరసం వేసి దానితో పళ్లు తోముకున్నా పసుపు రంగు మీద ప్రభావం చూపిస్తుంది. లవంగాలను పొడి చేసి పేస్టుతో కలిపి రుద్దుకుంటే కూడా ఫలితం ఉంటుంది. దీనివల్ల పళ్లు ధృఢంగా కూడా తయారవుతాయి. 

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments