Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇవి పాటిస్తే మీ ఒంట్లో ఎంత వేడైనా చిటికెలో ఎగిరిపోతుంది...

శరీరంలో వేడి అనేది చాలామందికి ఉండే ఆరోగ్య సమస్య. శరీరంలో వేడి చేయడం వల్ల చాలా రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వేడి వల్ల అంతర్గత అవయవాలకు నష్టం. వేడి తిమ్మిర్లు, వేడి దద్దుర్లు, మొటిమలు, కురుపులు, మూత్రం మంటతో రావడం, ముక్కులో నుంచి రక్తం కారడం, మైకం,

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (21:32 IST)
శరీరంలో వేడి అనేది చాలామందికి ఉండే ఆరోగ్య సమస్య. శరీరంలో వేడి చేయడం వల్ల చాలా రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వేడి వల్ల అంతర్గత అవయవాలకు నష్టం. వేడి తిమ్మిర్లు, వేడి దద్దుర్లు, మొటిమలు, కురుపులు, మూత్రం మంటతో రావడం, ముక్కులో నుంచి రక్తం కారడం, మైకం, వికారం వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. మితిమీరిన వేడి వాతావరణం, వేడిలో పనిచేయడం, వేడిని కలిగించే ఆహారాలను తీసుకోవడం, నీరు అతి తక్కువగా తాగడం ఇదంతా వేడి చేయడానికి కారణాలు.
 
ఈ సమస్యను అధిగమించేందుకు...  ఒక టీ స్పూన్ కరక్కాయ పొడిని తీసుకొని అందులో ఒక చెంచాడు పంచదారను కలిపి ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. వెన్నె తీసేసిన మజ్జిగను తీసుకుంటే మంచిది. 
 
ఎప్పటికప్పుడు చల్లటి నీటిని తాగడం వల్ల శరీరంలోని వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది. రోజులో రెండు లేదా మూడుసార్లు కొబ్బరి నీళ్ళు తాగాలి. పల్చటి మజ్జిగలో ఉప్పు, నిమ్మకాయ కలుపుకొని తాగితే మంచిది. పాలలో తేనెను కలిపి తాగాలి. వంటకాలలో కొబ్బరినూనె, ఆలివ్ నూనెలను వాడాలి. రోజూ ఉదయాన్నే దానిమ్మ రసం తాగాలి. గసగసాలు శరీరాన్ని చల్లబరచడానికి బాగా పనిచేస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

బొత్తిగా రోడ్ సెన్స్ లేదు, కళ్ల ముందు కనిపిస్తున్నా ఎలా ఢీకొట్టేసాడో చూడండి (video)

పవన్ కళ్యాణ్ కోసం ఎడ్లబండిపై 760 కిమీ ప్రయాణం చేసిన రైతు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

తర్వాతి కథనం
Show comments