అబ్బో పొట్ట దగ్గర కొవ్వు... కరిగిపోవాలంటే ఇవి తీస్కుంటే సరి...

ఇది చాలామందిని వేధిస్తున్న సమస్య. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతే ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. అందువల్ల వ్యాయామాలు చేయడంతో పాటు కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటుంటే నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు త

Webdunia
బుధవారం, 3 మే 2017 (19:43 IST)
ఇది చాలామందిని వేధిస్తున్న సమస్య. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతే ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. అందువల్ల వ్యాయామాలు చేయడంతో పాటు కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటుంటే నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు తగ్గుతుంది. శరీర బరువు కూడా అదుపులో వుంటుంది. ఇంతకీ అవి ఎలాంటి పదార్థాలో చూద్దాం.
 
అల్లం టీ: అల్లం టీ తాగడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. అల్లం శరీర ఉష్ణోగ్రతను పెంచి కొవ్వును కరిగిస్తుంది. రోజూ అల్లం టీ తాగితే పొట్టచుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. హెర్బల్ టీలు తాగడం వల్ల కూడా శరీర బరువును తగ్గించుకుని నాజూకుగా మారవచ్చు.
 
బాదం పప్పులు: రోజూ బాదం పప్పులు తింటే పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడమే కాదు శరీర బరువును తగ్గిస్తాయి. బాదంలోని ఒమేగా-3 ప్యాటీ యాసిడ్స్ శరీరంలో పేరుకున్న ఫ్యాట్‌ని కరిస్తాయి. అందుకే రోజూ రాత్రి పడుకోబోయే ముందు ఆరేడు బాదం పప్పులు నీళ్లలో నానబెట్టి ఉదయం ఆ పప్పుపై వున్న పొట్టు తీసి తినాలి.
 
పుదీనా: ఇది కూడా పొట్ట చుట్టూ వున్న కొవ్వును కరిగించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. పొట్టలోని గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. ఇందులోని యాంటాక్సిడెంట్లు జీవక్రియ సరిగా జరిగేట్లు సహాయపడతాయి. కొవ్వును కరిగిస్తాయి. పుదీనా, కొత్తిమీర ఆకులను కలిపి బాగా సూరి అందులో నిమ్మరసం వేసి పేస్టులా తయారుచేయాలి. ఆ పేస్టులో చిటికెడు ఉప్పు వేయాలి. రోటి, ఇడ్లీల్లో ఈ చట్నీ వేసుకుని తింటే జీర్ణశక్తికి ఎంతో మంచిది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రేమజంటను బెదిరించి బాలికపై సామూహిక అత్యాచారం...

భార్య మరొకరితో వెళ్లిపోయిందనీ ఇద్దరు పిల్లలను కడతేర్చి ఆత్మహత్య చేసుకున్న భర్త

గిన్నిస్ గ్లోరీ చారిత్రాత్మక మిస్సింగ్ లింక్ ప్రాజెక్ట్ పూర్తి: నవయుగకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ ప్రశంస

బీజేపీ చిత్తుగా ఓడిపోతుంది... 200కు పైగా సీట్లలో గెలుస్తాం : మమతా బెనర్జీ

అండమాన్-నికోబార్ బీచ్‌ నీటి అడుగున జాతీయ జెండా - గిన్నిస్ రికార్డ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎర్రటి ఎండలో ఎద్దును బాధపెట్టారు, వైసిపి నాయకులపై చర్యలు తీసుకోండి: యాంకర్ రష్మి

సనోజ్ మిశ్రాపై మళ్లీ మోనాలిసా ఆరోపణలు.. పదిసార్లు లైంగికంగా వేధించాడు

Ram Charan: సతీ లీలావతి ట్రైలర్‌ను రామ్ చరణ్ విడుదల చేశారు

Nagababu: మేం కాపులం టైటిల్ మేము ‘కాప్‌’లం’ గా మారిందా?

Varalaxmi: పోలీస్ కంప్లైంట్ చిత్రంలో సూప‌ర్ స్టార్ కృష్ణపై స్పెష‌ల్ సాంగ్‌

తర్వాతి కథనం
Show comments