Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఏం చెయ్యాలి?

అధిక బరువు తగ్గించుకోవడం ఎంత కష్టమో... సన్నగా ఉన్నవారు లావు కావడం అంతే కష్టం. సాధారణంగా బరువు ఎక్కువగా ఉన్నా, మరీ సన్నాగా ఉన్నా మన ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నవారు ఎత్తుకు తగ్గ బరువు ఉండాల్సిందే. కొంతమంది బర

Webdunia
మంగళవారం, 20 జూన్ 2017 (20:21 IST)
అధిక బరువు తగ్గించుకోవడం ఎంత కష్టమో... సన్నగా ఉన్నవారు లావు కావడం అంతే కష్టం. సాధారణంగా బరువు ఎక్కువగా ఉన్నా, మరీ సన్నాగా ఉన్నా మన ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నవారు ఎత్తుకు తగ్గ బరువు ఉండాల్సిందే. కొంతమంది బరువు పెరగాలని ఇష్టమొచ్చినట్లు తింటారు. కానీ వారు మాత్రం లావవ్వరు. లావు కావాలనే వారు లైఫ్ స్టైల్లో మార్పులు తీసుకోవాలి. కొంతమంది బరువు తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం హైపర్ డయాబెటిస్, అనారోగ్య సమస్యలు.
 
చాలామంది లావయ్యేందుకు జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్‌లు తింటుంటారు. అయితే వీటి కారణంగా పొట్టలో క్రొవ్వు పేరుకుపోతుంది తప్ప లావు మాత్రం కారు. అంతేకాదు వీటి వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. మరికొంతమందైతే బరువును పెంచుకునేందుకు పౌడర్లు, మెడిసిన్లను వాడుతుంటారు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటాయట. బరువు పెంచుకునేందుకు హెల్తీ డైట్ ఫాలో కావాలి. 
 
సాధారణంగా ఒకరోజులో ఒక వ్యక్తికి 2 వేల క్యాలరీలు ఖర్చవుతాయి. కానీ బరువు పెరగాలనుకుంటే ఎక్కువ క్యాలరీలను తీసుకోవాలి. అయితే శరీరానికి ఎక్కువ క్యాలరీని అందించే పదార్థాలు అరటిపండ్లు, పాలు, ఖర్జూరా పండ్లు, నెయ్యి, కిస్‌మిస్‌లు సరైన విధంగా తీసుకుంటే మంచిది. ఉదయం రెండు గ్లాసుల పాలు, ఆ తర్వాత రెండు అరటిపండ్లును తీసుకోవాలి. నల్లటి మచ్చలున్న అరటిపండ్లను తీసుకుంటే మరింత మంచిది. 
 
ఎందుకంటే నల్లటి అరటిపండులో న్యూట్రియన్స్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఒక టీస్పూన్ నెయ్యి వేసి మిక్సీలో జ్యూస్‌లా తయారుచేసుకోవాలి. ఈ జ్యూస్‌ను ఉదయం తాగాలి. ఇలా క్యాలరీలను ఇచ్చే వాటిని తీసుకుంటే ఎనర్జీతో పాటు బరువు పెంచడంలో సహాయపడుతుంది. దీంతో పాటు రాత్రి పడుకునేముందు ఒక గ్లాసు పాలు తాగాలి. పాలలో 5 ఖర్జూరాలను వేసి మిక్సీలో జ్యూస్‌లా చేసుకుని తాగాలి. ఇలా చేస్తే బలహీనతలను దూరం చేసి బలాన్ని పెంచడంతో పాటు కండరాలను ధృడంగా ఉండేలా చేస్తుంది. మహిళలకైతే పీరియడ్ సమస్యను తగ్గిస్తుంది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments