Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్లో దోమలు 'గుయ్'మంటున్నాయా... ఆలౌట్, గుడ్ నైట్ అవసరంలేకుండానే చంపేయచ్చు... ఎలా?

ఎలాంటి హాని లేకుండా సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన ద్రవం ద్వారా దోమలను ఎలా చంపవచ్చో తెలుసుకుందాం. కొద్దిగా నీటిని తీసుకొని వేడి చేసి చల్లార్చాలి. ఒక ప్లాస్టిక్ బాటిల్‌ను తీసుకొని రెండుగా కత్తిరించాలి. దాన్నించి కింద భాగం తీసుకొని ముందుగా సిద్ధం చే

Webdunia
బుధవారం, 20 జులై 2016 (19:38 IST)
ఎలాంటి హాని లేకుండా సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేసిన ద్రవం ద్వారా దోమలను ఎలా చంపవచ్చో తెలుసుకుందాం. కొద్దిగా నీటిని తీసుకొని వేడి చేసి చల్లార్చాలి. ఒక ప్లాస్టిక్ బాటిల్‌ను తీసుకొని రెండుగా కత్తిరించాలి. దాన్నించి కింద భాగం తీసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న నీటిని అందులో పోయాలి. ఆ నీటిలో కొద్దిగా చెక్కెర, కొంచెం ఈస్ట్‌ను వేయాలి. ఈస్ట్ మనకు కిరణా షాపులలో, సూపర్ మార్కెట్లలో, బేకరీలలో దొరుకుతుంది. 
 
అనంతరం కొంచెం తేనెను ఆ మిశ్రమంలో కలపాలి. ఇప్పుడు ప్లాస్టిక్ బాటిల్ మిగిలిపోయిన రెండో ముక్కను పైభాగాన్ని రివర్స్ చేసి కింద భాగంలో పెట్టాలి. రెండు ప్లాస్టిక్ ముక్కలు కలిసే చోట గమ్‌ను రాయాలి. దీంతో అవి ధృడంగా ఉంటాయి. ఇలా తయారైన ద్రవం నుంచి కార్బన్ డై యాక్సెడ్ విడుదలవుతూ ఉంటుంది. ఇది దోమలను ఆకర్షిస్తుంది. దీంతో దోమలు ఆ ద్రవం వద్దకు వచ్చి, అందులో పడి చనిపోతాయి. ఇలా దోమలను విజయవంతంగా నిర్మూలించవచ్చు. దీన్ని గదిలో ఏదైనా ప్రదేశంలో పెడితే చాలు. ఆ గదిలో ఉన్న దోమలన్నీ అక్కడకు వచ్చి చనిపోతాయి. అయితే ఇది కేవలం కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. చనిపోయిన దోమలతో ఆ బాటిల్ నిండిపోయాక మళ్ళీ అలాగే ద్రవాన్ని తయారుచేసుకొని, బాటిల్స్‌ను కత్తిరించి పెడితే సరిపోతుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments