Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్లమ్ పండ్లు తింటే ఆ వ్యాధులన్నీ ఔట్...

Webdunia
గురువారం, 10 జనవరి 2019 (20:18 IST)
సాధారణంగా మనం రకరకాల పండ్లను తింటూ ఉంటాం. మనం తినే పండ్లలో ప్లమ్ పండ్లు అన్ని కాలాలలోను దొరకవు. పైగా వచ్చినప్పుడు కూడా వాటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. కానీ అవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. వాటి ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
1. కాలేయం, రొమ్ము, పేగు క్యాన్సర్‌లను నివారిస్తాయి. అంటే క్యాన్సర్ రోగులలో కూడా ఆయా కణాలు పెరగకుండా ఉండేలా చూస్తాయి. అంతేకాకుండా ఈ పండ్లు కీమోథెరఫీ కారణంగా తలెత్తే దుష్పలితాలను తగ్గిస్తాయి.
 
2. ఎముక సాంద్రత తక్కువుగా ఉండి ఆస్టియో పొరోసిస్‌తో బాధ పడుతున్న వారు ఎండుపండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు ప్రతిరోజు వీటిని తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. 
 
3. ప్లమ్ పండ్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. వీటిలో కె విటమిన్ శాతం ఎక్కువుగా ఉండటంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అంతేకాదు వీటిలోని ప్లెవోనాయిడ్లు ఊబకాయాన్ని నిరోధిస్తాయి. 
 
4. బాగా అలసిపోయి నీరసపడినప్పుడు రోజూ 5 పండ్లను తీసుకోవడం వల్ల వెంటనే శక్తి వస్తుంది. ఎందుకంటే వీటివల్ల బిగతీసుకున్న కండరాలు తిరిగి యధా స్ధితికి రావడంతో అప్పటివరకు కణాల మధ్య పేరుకున్న ఒత్తిడి తగ్గుతుంది.
 
5. ప్లమ్ ప్రూట్స్ జీర్ణ వ్యవస్థకి ఎంతో మంచివి. మలబద్ధకాన్ని తగ్గించడంతో పాటు వీటిలోని ఇసాటిన్, సార్బిటాల్ ... వంటి పదార్ధాలు టాక్సిన్లు బయటకు పోయేలా చేస్తాయి. అంతేకాదు ఈ పండ్లు జీవక్రియ వేగాన్ని పెంచుతాయి. వీటిల్లో పీచూ ఎక్కువే. ఇంకా వీటిలోని విటమిన్- సి చర్మ ఆరోగ్యానికి, సౌందర్యానికి కూడా ఎంతో తోడ్పడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నెలకు రూ.లక్ష జీతం... పైసా కట్నం లేకుండా పెళ్లి.. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త (Video)

డాక్టర్లు చేతులెత్తేశారు.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ప్రాణం పోసింది!

పురుషులకూ గర్భ నిరోధక పిల్ - కొత్త పిల్‌ను అభివృద్ధి చేసిన అమెరికా

పలు దేశాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు : భారత్ - చైనాలపై ఎంతంటే?

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ప్రతిభకంటే బంధుప్రీతికే పెద్దపీట : పాయల్ రాజ్‌పుత్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments