Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూత్రకోశంలో రాళ్ళను కరిగించే ఉలవలు

ఒకప్పుడు ఎడ్లకు, గుర్రాలకు దాణాగా వాడే ఉలవలు ఇళ్ళలో తినడానికి అంతగా ఇష్టపడేవారు కాదు. ఒకవేళ ఎవరైనా ఉలవలు గుగ్గిళ్ళుగా చేసుకొని తినడమో లేక చారు తయారుచేసుకుని వాడడమో చేస్తే వారు పేదవారై ఉండేవారు . కానీ నేడు ఉలవలు - ఉలవచారు విందు వినోదాలలో వాడడం స్టేటస్

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2016 (22:15 IST)
ఒకప్పుడు ఎడ్లకు, గుర్రాలకు దాణాగా వాడే ఉలవలు ఇళ్ళలో తినడానికి అంతగా ఇష్టపడేవారు కాదు. ఒకవేళ ఎవరైనా ఉలవలు గుగ్గిళ్ళుగా చేసుకొని తినడమో లేక చారు తయారుచేసుకుని వాడడమో చేస్తే వారు పేదవారై ఉండేవారు . కానీ నేడు ఉలవలు - ఉలవచారు విందు వినోదాలలో వాడడం స్టేటస్‌ సింబల్‌ అనడంలో అతిశయోక్తి లేదు. ఉలవచారు నేడు అత్యంత ఖరీదైన వంటకం.
 
ఉలవలను ముఖ్యంగా చారు రూపంలో వాడతతారు. ఇవి వేడిచేసే గుణం కలవి. ఉలవచారు చిక్కగా ఎర్రని లేక ఇటుకరాయి రంగులో ఉంటుంది. తినడానికి ఉలవచారు కమ్మగా ఉన్నప్పటికీ వాతము చేసే గుణము ఉన్న వారు దీనిని ప్రత్యేకించి వాడవచ్చు. ఉలవలు మూత్రకోశంలోని రాళ్ళను కరిగించే గుణం ఉంటుంది. కాబట్టి మూత్రాశయ వ్యాధులలో దీనిని ఇతర మందులతో పాటుగా ఆహారంలో వాడవచ్చు.
 
ఉలవలు స్త్రీలలో ఋతు స్రావమును జారీ చేసే గుణం కలిగి ఉంది. ఋతువు సరిగా రాని వారు ఉలవలు వాడటం వల్ల ఉపయోగంగా ఉంటుంది. అధికంగా చెమటలు పడుతున్న వారు ఆహారంలో ఉలవలు వాడటం వల్ల చెమటలు హరించిపోతాయి.
 
ఉలవలు మంచి ప్రొటీన్లను కలిగి ఉన్నాయి. నీరసమును పోగొడుతాయి. నిస్సత్తుతోను, రక్తహీనతతోనూ బాధపడేవారు ఉలవలు తరచూ ఆహారంలో తీసుకుంటే మంచిది. ఉలవలు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. అజీర్తిని పోగొడుతుంది. కడుపులో వాతమును త్వరగా తగ్గిస్తుంది. అజీర్తి విరేచనాలు అయ్యేవారు ఉలవచారు వాడటం వల్ల మేలు జరుగుతుంది. 
 
ఉలవచారు కుక్క కరిచిన వారు అసలు తీసుకోకూడదు. కుక్క కరిచి చాలా రోజులయినప్పటికీ ఉలవచారు వాడారంటే వారి పరిస్థితి ప్రమాదంలో పడుతుంది. రేబిస్‌ వైరస్‌ విజృంభించి ప్రాణాపాయం కలిగించవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

తర్వాతి కథనం
Show comments