Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలబంద గుజ్జుతో చెమట పొక్కులకు చెక్

Webdunia
గురువారం, 19 మే 2016 (16:51 IST)
వేసవికాలం వచ్చిందంటే చాలు చాలామంది చెమట పొక్కులతో సతమతమవుతుంటారు. సాధారణంగా వేసవికాలంలో శరీరానికి చెమటపడుతుంది. ఆ క్రమంలో కొన్నిసార్లు చెమట గ్రంథులు మూసుకుపోతాయి. అప్పుడే చెమటకాయలు వస్తాయి. చర్మం ఎర్రగా కందిపోయి, చిన్నచిన్న నీటిపొక్కుల్లా మొదలవుతాయి. దాంతో విపరీతమైన మంటా, దురద మొదలవుతుంది. ఇవి శరీరంలో ఏ భాగంలోనైనా రావొచ్చు. అయితే వీటిబారి నుంచి తప్పించుకోడానికి కొన్నిచిట్కాలు పాటిస్తే సరి...
 
ఎండాకాలంలో ప్రతి రోజూ రెండుమూడు సార్లు చల్లని నీటితో స్నానం చేయడం మంచిది. ఆహారంలో తరచు మంచినీళ్లు, మజ్జిగ తీసుకుంటూ ఉండాలి. కొబ్బరినీళ్లు, అనాస రసం, చెరకు రసం ఈ వేసవి కాలంలో తీసుకుంటే చలువ చేస్తుంది, వేడిని తగ్గిస్తుంది.
 
చెమట పొక్కులు వచ్చిన ప్రాంతంలో కలబంద గుజ్జును రాయాలి. ఇందులో యాస్ట్రింజెంట్‌ గుణాలు అధికంగా ఉంటాయి. చెమట పొక్కుల్నిమాత్రమే కాకుండా కొన్నిరకాల ఇన్‌ఫెక్షన్లను దూరం చేస్తాయి.
 
ఐసుముక్కల్ని మెత్తని వస్త్రంలోకి తీసుకుని చెమట పొక్కుల మీద నెమ్మదిగా వత్తాలి. తరచూ ఇలా చేయడం వల్ల పొక్కులు త్వరగా తగ్గిపోతాయి. వాటివల్ల వచ్చే మంట కూడా అదుపులో ఉంటాయి. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments