బ్రేవ్.. బ్రేవ్.... గ్యాస్ ట్రబుల్ అడ్డుకోవడమెలా? ఏం తింటే ఆగుతుంది?

కడుపు ఉబ్బరం, పొట్ట నొప్పి, బ్రేవ్ బ్రేవ్ మంటూ త్రేన్పులు. కూర్చున్నచోట కూర్చోలేని పరిస్థితి. చికాకు, కోపం ఇవన్నీ గ్యాస్ ట్రబుల్ లక్షణాలే. ఈ సమస్యను అధిగమించాలంటే ఇవి పాటించాలి. 1. మానసిక ఒత్తిడిని నివారించడానికి ధ్యానం, యోగా నిత్యం చేయాలి. 2. ప్రతి

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (19:49 IST)
కడుపు ఉబ్బరం, పొట్ట నొప్పి, బ్రేవ్ బ్రేవ్ మంటూ త్రేన్పులు. కూర్చున్నచోట కూర్చోలేని పరిస్థితి. చికాకు, కోపం ఇవన్నీ గ్యాస్ ట్రబుల్ లక్షణాలే. ఈ సమస్యను అధిగమించాలంటే ఇవి పాటించాలి.
 
1. మానసిక ఒత్తిడిని నివారించడానికి ధ్యానం, యోగా నిత్యం చేయాలి.
2. ప్రతిరోజూ విధిగా వ్యాయామం చేయాలి.
3. పీచు పదార్థాలు ఎక్కువగా వున్న తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
4. టీ, కాఫీలు మానేయాలి.
5. మసాలాలు, వేపుళ్లు, ఆయిల్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ మానివేయాలి.
6. వేళకు ఆహారం తీసుకుంటూ నీళ్లు సరిపడినంత తాగాలి.
7. నిల్వ వుంచిన పచ్చళ్లు తినడం మానేయాలి.
 
సమస్యను అడ్డుకునేందుకు ఏం చేయాలి?
* శొంఠి చూర్ణంతో పాత బెల్లం సమంగా కలిపి ప్రతిరోజూ ఉదయాన్నే తిని ఆ తర్వాత వేడి నీళ్లు తాగితే కడుపులో వున్న గ్యాస్ సమస్య పోతుంది. 
 
* ధనియాలు, శొంఠి సమభాగాలు చూర్ణం చేసి కలిపి ఒక టీ స్పూన్ ప్రతిరోజూ ఉదయం, రాత్రి భోజనం తర్వాత వేడి నీటితో తీసుకుంటే కడుపులో చెడుగాలి పోయి సాఫీగా విరేచనం అవుతుంది.
 
* అల్లం రసం పొంగించి దానిలో బెల్లం పొడి కొద్దిగా కలిపి ఒక టేబుల్ స్పూన్ తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Google‌కి బాబు ఇచ్చిన ప్రోత్సహకాలు చూసి గుడ్లు తేలేస్తున్న కర్నాటక ఐటి మినిస్టర్ (Video)

మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preity Zinta: ఆభరణాలు జీవితంలో అమూల్యమైన క్షణాలంటున్న ప్రీతి జి జింటా

Tilak Verma : ఆసియా కప్ హీరో క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి

K-ర్యాంప్ ట్రైలర్ తో డీజే మిక్స్ యూత్ కు రీచ్ చేస్తున్న కిరణ్ అబ్బవరం

Chiru: మన శంకర వర ప్రసాద్ గారు...మీసాల పిల్ల.. 17 మిలియన్‌+ వ్యూస్ సాధించింది

World Health Summit 2025 : తొలి భారతీయ నటిగా కృతి సనన్ గుర్తింపు!

తర్వాతి కథనం
Show comments