అవి తింటే మజ్జిగ తీసుకోవడం తప్పనిసరి...

Webdunia
సోమవారం, 7 జనవరి 2019 (10:06 IST)
మసాలా దినుసులు తింటున్నారా.. అయితే తప్పక మజ్జిగ తీసుకోవాలని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. మజ్జిగలోని లాక్టిక్‌ ఆసిడ్‌ అనే ఆమ్లం కడుపులోని గ్యాస్‌ సమస్యను తగ్గిస్తుంది. ఆయుర్వేద ప్రకారం గ్యాస్‌కు మజ్జిగ మంచిది. మసాలా దినుసులతో చేసిన ఆహారం తీసుకున్నవారు తప్పకుండా మజ్జిగ తీసుకోవాలి. మసాలా దినుసులు తిన్న తరువాత మజ్జిగ సేవించడం ద్వారా అసిడిటీ కూడా తగ్గుముఖం పడుతుంది. 
 
పచ్చని తులసి ఆకులను వేడి నీటిలో మరగించుకోవాలి. కాసేపటివరు అలానే ఉంచి ఆ తరువాత చల్లార్చుకోవాలి. ఈ తులసి నీటిని ప్రతి రోజూ తాగడం వలన  పది రోజుల్లో గ్యాస్‌ కొంతవరకైనా తగ్గుతుందని వారు సూచిస్తున్నారు. అలానే గ్యాస్‌కు ఉపశమనంతో పాటు శరీరానికి వెంటనే శక్తి లభించాలంటే కొబ్బరి నీళ్లు తాగాలి. బెల్లం గ్యాస్‌ సమస్యకు ఎంతగానో దోహదపడుతుంది. బెల్లంలోని మెగ్నీషియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. క్యాల్షియం కూడా లభిస్తుంది.
 
ఇకపోతే.. ఒక కప్పు నీటిని మరిగించి అందులో ఒక స్పూన్‌ సోంపు వేసి కాసేపు అలానే ఉంచాలి. ఆ పాత్రకు మూత పెట్టి రాత్రంతా అలానే ఉంచుకోవాలి. ఉదయాన్నే ఈ నీటిలో స్పూన్ తేనె కలుపుకుని తాగండి. ఇలా రోజుకు మూడుపూటలా తాగితే అసిడిటీకి పరిష్కారం లభించినట్లేనని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పూటుగా లిక్కర్ సేవించి ర్యాపిడో ఎక్కిన యువతి, సీటు నుంచి జారుతూ... వీడియో వైరల్

Survey: సర్వేలో బాలకృష్ణపై హిందూపూర్ ప్రజలు ఏమంటున్నారు?

రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎం అవుతాడనుకుంటే అలా అయ్యారు: వీడియోలో కెఎ పాల్

పులివెందులలో జగన్‌కు ఎదురుదెబ్బ.. వేంపల్లి నుండి టీడీపీలో చేరిన వైకాపా సభ్యులు

Chandrababu: ఇండిగో సంక్షోభం.. స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులో ప్రమాదం... హీరో రాజశేఖర్‌ కాలికి గాయాలు

Tarun Bhaskar: రీమేక్ అయినా ఓం శాంతి శాంతి శాంతిః సినిమాని లవ్ చేస్తారు : తరుణ్ భాస్కర్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. ఏం కష్టమొచ్చిందో?

Rana: చాయ్ షాట్స్ కంటెంట్, క్రియేటర్స్ పాపులర్ అవ్వాలని కోరుకుంటున్నా: రానా దగ్గుపాటి

Pawan Kalyan!: పవన్ కళ్యాణ్ తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చిత్రం !

తర్వాతి కథనం
Show comments