Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెల్త్ టిప్స్: జలుబుతో ఇబ్బంది పడుతుంటే?

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (15:49 IST)
జలుబుతో ఇబ్బంది పడుతుంటే? 
జలుబుతో ఇబ్బంది పడుతూ...శ్వాస పీల్చడం కష్టమైతే ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో రెండు వెల్లుల్లి రేకులను చిదిమి వేసుకుని తాగండి. ఇలా మూడు రోజులు రెండుపూటలా సేవిస్తుంటే ఉపశమనం లభిస్తుంది. శరీరంనుంచి దుర్గంధం వస్తుంటే స్నానం చేసే నీటిలో ఒక కప్పు టమోటా రసం కలిపి అరగంట తరువాత స్నానం చేయండి. ఇలా నిత్యం చేస్తుంటే శరీరంనుంచి వచ్చే దుర్గంధం తొలగిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
గర్భిణీ స్త్రీలకు వాంతులవుతుంటే...!
స్త్రీలు గర్భం ధరించిన తొలి రెండు నెలలు వాంతులతో సతమతమౌతుంటారు. దీంతో వారిలో చికాకు మరింత పెరిగిపోతుంటుంది. దీనినుంచి ఉపశమనం పొందేందుకుగాను ధనియాలతో కషాయం చేసుకుని అందులో కలకండ తగినంత కలుపుకుని సేవిస్తే వాంతులనుంచి ఉపశమనం కలుగుతుంది. దీంతోపాటు ఉత్పన్నమయ్యే గుండె దడ తగ్గుతుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.
 
కంటి జబ్బులతో బాధపడుతుంటే...!
కళ్ళకు ధనియాలు చాలా ఉపయోగకరం అంటున్నారు వైద్యులు. కాసిన్ని ధనియాలు దంచుకుని నీటిలో ఉడకబెట్టుకోండి. కాచి చల్లార్చిన తర్వాత వడపోసి ఓ సీసాలో భద్రపరచుకోండి. ఈ ద్రవంలోని రెండు చుక్కలు కళ్ళల్లో డ్రాప్స్‌లా వేస్తే కంట్లో మంట, కళ్ళ నొప్పులు, కళ్ళనుంచి నీరు కారడంలాంటి సమస్యలుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments